ప్రయాణికులకు బిగ్ అలర్ట్: ఏపీ, తెలంగాణల్లో భారీగా రైళ్లు రద్దు
Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా మరింత బలపడింది. వాయుగుండంగా మారింది. ఇది- వచ్చే 24 గంటల వ్యవధిలో క్రమంగా తుఫాన్‌గా ఆవిర్భవించనుంది. దీని ప్రభావం ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా ఉండబోతోంది.
బంగాళాఖాతం తూర్పు- మధ్య ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ ఉత్తర తీరంంలో ఈ నెల 19వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇది తొలుత అల్పపీడనంగా, అనంతరం వాయుగుండంగా మారింది. వాతావరణ కేంద్రం వేసిన అంచనాల ప్రకారం- క్రమంగా అతి తీవ్ర తుఫాన్‌గా ఆవిర్భవిస్తుంది.

దీనికి దానా అని ఇదివరకే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఖతర్ ఈ పేరును సూచించింది. తూర్పు- మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండంగా బలపడింది. ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయ దిశగా 730, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 770, బంగ్లాదేశ్‌లోని ఖేపుపారాకు ఆగ్నేయ దిశగా 740 కిలో మీటర్ల దూరంలో ఉంది.
ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారు జామున ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. ఈదురు గాలుల తీవ్రత 140 నుంచి 160 కిలోమీటర్ల వరకూ పెరిగడానికీ అవకాశం ఉంది.
దీని ప్రభావం వల్ల బుధవారం నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ప్రత్యేకించి ఒడిశాలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే అక్కడ సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి.
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా 41 రైళ్లు రద్దయ్యాయి. తుఫాన్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
హౌరా- సికింద్రాబాద్, కామాఖ్య- ఎస్ఎంవీటీ బెంగళూరు, ఖరగ్‌పూర్- విల్లుపురం, హౌరా- భువనేశ్వర్, షాలిమార్- హైదరాబాద్, సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్, షాలిమార్- చెన్నై సెంట్రల్, హౌరా- తిరుచిరాపల్లి, హౌరా- ఎస్ఎంవీటీ బెంగళూరు, షాలిమార్- వాస్కోడగామా రైళ్లు రద్దయ్యాయి.
హౌరా- చెన్నై సెంట్రల్, పాట్నా- ఎర్నాకుళం, సంత్రాగచ్చి- చెన్నై సెంట్రల్, సిల్చార్- సికింద్రాబాద్, దిబ్రూగఢ్- కన్యాకుమారి, సికింద్రాబాద్- భువనేశ్వర్, చెన్నై సెంట్రల్- హౌరా, పుదుచ్చేరి- హౌరా, చెన్నై సెంట్రల్- షాలిమార్, పుదుచ్చేరి- భువనేశ్వర్, కేఎస్ఆర్ బెంగళూరు- భువనేశ్వర్ రైళ్లను రద్దు చేశారు.
సీఎస్‌టీ ముంబై- భువనేశ్వర్, ఎస్ఎంవీటీ బెంగళూరు- గువాహటి, చెన్నై సెంట్రల్- హౌరా, చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి, ఎస్ఎంవీటీ బెంగళూరు- ముజఫ్ఫర్‌పూర్, హైదరాబాద్- హౌరా, కన్యాకుమారి- దిబ్రూగఢ, తాంబరం- సంత్రాగచ్చి, ఎస్ఎంవీటీ బెంగళూరు- హౌరా, సికింద్రాబాద్- హౌరా రైళ్లను రద్దు చేశారు.
సికింద్రాబాద్- మల్డా టౌన్, యశ్వంతపూర్- హౌరా, తిరునెల్వేలి- షాలిమార్, పూరీ- తిరుపతి, భువనేశ్వర్- సికింద్రాబాద్, భువనేశ్వర్- కేఎస్ఆర్ బెంగళూరు- భునేశ్వర్- రామేశ్వరం, రామేశ్వరం- భువనేశ్వర్ రైళ్లను రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications