Cyclone Dana: పొంచివున్న పెను తుఫాన్- ఏపీకి పెను ముప్పు

Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి- దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను ముంచెత్తాయి. చెరువులు, కుంటలు వరదనీటితో పోటెత్తాయి. కొత్త నీటితో కళకళలాడుతున్నాయి.

నగరాలు అతలాకుతలం..

ఇదే తరహా పరిస్థితులు అటు తమిళనాడు, కర్ణాటకల్లోనూ నెలకొన్నాయి. తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. అల్పపీడన ప్రభావంతో చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లు అతలాకుతలం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. బెంగళూరులోనూ వర్షాలు దంచికొట్టాయి.

Cyclone Dana IMD predicts Heavy to very heavy rain over these state including Andhra

మరో రౌండ్..

మరోసారి అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడతో పాటు ఒడిశాలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కావొచ్చు.

బంగాళాఖాతంలో తుఫాన్..

బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడబోతోండటమే దీనికి కారణం. ఇప్పటికే బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా, అండమాన్- నికోబార్ దీవుల సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 21వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర చెప్పారు.

దానా సైక్లోన్..

22వ తేదీ నాటికి ఇది బంగాళాఖాతం మధ్య ప్రాంతానికి కదులుతుందని, అక్కడ వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు. అనంతర తుఫాన్‌గా ఆవిర్భవిస్తుందని, దీనికి దానా అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. 23వ తేదీ నుంచి దీని కదలికలు చురుగ్గా ఉంటాయని అన్నారు.

అండమాన్‌పై

దానా తుఫాన్ ప్రభావంతో నేటి నుంచి 24వ తేదీ వరకు అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అలల తాకిడి ఉధృతంగా ఉంటుందని, సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని అన్నారు. 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు.

ఉత్తరాంధ్ర సహా..

23వ తేదీ నుంచి బంగాళాఖాతం ఉత్తరం- ఆగ్నేయ దిశగా ఇది కదులుతుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్‌లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని మృత్యుంజయ్ మొహపాత్ర చెప్పారు. 60 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

తీరం కల్లోలం..

దీని ప్రభావం వల్ల ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఒడిశా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని మొహపాత్ర తెలిపారు. పిడుగులు పడొచ్చని, బలమైన ఈదురుగాలులు వీస్తాయనీ అన్నారు. వర్షాల తీవ్రత ఏపీ ఉత్తర ప్రాంత జిల్లాలు, పశ్చిమ బెంగాల్‌పైనా అధికంగా ఉంటుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+