ఎయిర్‌పోర్ట్ ధ్వంసం: విశాఖకు బాబు, సాయం(పిక్చర్స్)
హైదరాబాద్: హుధుద్ పెను తుపాను నష్టాన్ని ఏ, బి, సి కేటగిరిలుగా విభజించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తుపాను ప్రభావింత ప్రాంతాల్లో ఆహారం సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఆహార సరఫరా చేపట్టనున్నట్లు చెప్పారు. బాధితులకు నేరుగా అందిస్తామని తెలిపారు. నీరు, పాలు, బ్రేడ్ వంటి ఆహార పదార్థాలను అందిస్తున్నామని చెప్పారు.
సహాయక చర్యల కోసం సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణకు కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్‌తో మాట్లాడతానని చంద్రబాబు తెలిపారు. ఒడిశా, తెలంగాణ, తమిళనాడు పవర్ గ్రిడ్‌ల నుంచి వాడుకుంటామని చెప్పారు. ప్రతీ మండలానికి ఓ ఐఏఎస్ అధికారిని నియమించి, ఏరియల్ సర్వే నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. జన్మభూమి నోడల్ అధికారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటారని చెప్పారు.
తక్షణ సాయంగా 25కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, కిలో పంచదార అందజేయనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం సాయంత్రానికి టెలిఫోన్ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. కాగా, కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం చంద్రబాబుకు ఫోన్ చేసి హుధుద్ ప్రభావ పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నష్టానికి సంబంధించిన వివరాలను ఆయనకు తెలిపారు. కాగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి.
ఆదివారం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నం బయల్దేరారు. రాజమండ్రిలో ఆయన అధికారులతో తుపాను పరిస్థితిపై సమీక్షించారు. రాజమండ్రి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో విశాఖ చేరుకుని అక్కడి నుంచి ఏరియల్ సర్వే నిర్వహించి అనంతరం అధికారులతో తుపాను నష్టంపై సమీక్షించనున్నారు. నష్టం అంచనా వేసేందుకు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీని చంద్రబాబు సాయం కోరారు. తుపాను నష్టం రూ. 600 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
రహదారులపై పడిన విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణకు కూడా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. మంగళవారం నుంచి నీరు విడుదల చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఏపి డిజిపి రాములు కూడా తుపాను నష్టంపై సమీక్ష నిర్వహించారు.

ధ్వంసమైన విశాఖ ఎయిర్‌పోర్ట్
హుధుద్ తుపాను ధాటికి విశాఖపట్నం విమానాశ్రయం భారీ స్థాయిలో ధ్వంసమైంది. పెనుగాలులకు విమానాశ్రయం పైకప్పు ఎగిరిపోయింది.

ధ్వంసమైన విశాఖ ఎయిర్‌పోర్ట్
విమానాశ్రయంలోని అద్దాలు పగిలిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.

ధ్వంసమైన విశాఖ ఎయిర్‌పోర్ట్
ఆనవాళ్లు సైతం కోల్పోయే స్థాయిలో ధ్వంసమై విమానాశ్రయం.. తుపాను సృష్టించిన బీభత్సానికి సాక్ష్యంగా నిలిచింది.

ధ్వంసమైన విశాఖ ఎయిర్‌పోర్ట్
కాగా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుపాను కారణంగా వేల ఎకరాల్లో పంటలు కూడా ధ్వంసమయ్యాయి. పలు ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్ వ్యవస్థ కూడా అతలాకుతలం అయింది.
విశాఖ విమానాశ్రయం ధ్వంసం
హుధుద్ తుపాను ధాటికి విశాఖపట్నం విమానాశ్రయం భారీ స్థాయిలో ధ్వంసమైంది. పెనుగాలులకు విమానాశ్రయం పైకప్పు ఎగిరిపోయింది. విమానాశ్రయంలోని అద్దాలు పగిలిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఆనవాళ్లు సైతం కోల్పోయే స్థాయిలో ధ్వంసమై విమానాశ్రయం.. తుపాను సృష్టించిన బీభత్సానికి సాక్ష్యంగా నిలిచింది. కాగా, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుపాను కారణంగా వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.












Click it and Unblock the Notifications