హుధుద్ తుఫాను బీభత్సం: తల్లడిల్లిన విశాఖ (పిక్చర్స్)

విశాఖఫట్నం: హుధుద్ తుఫానుకు విశాఖపట్నం అతలాకుతలమైంది. రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడింది. పెను తుఫాను చండ ప్రచండంగా విరుచుకుపడడంతో దిక్కు తోచని స్థితిలో పడింది. ఆదివారం ఉదయం 10 గంటలకు విశాఖలోని కైలాసగిరి వద్ద తీరాన్ని తాకిన హుధుద్ మధ్యాహ్నం 12:30- 1 గంట మధ్య పూడిమడక వద్ద తీరాన్ని దాటింది. ఈ రెండున్నరగంటల్లో హుద్‌హుద్‌ విలయతాండవానికి విశాఖ గజగజ వణికిపోయింది.

భూ, జల, వైమానిక రవాణా మార్గాలను కలిగి ఉన్న విశాఖకు ఇప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్లు తెగిపోయాయి. రైలు మార్గం ఆగిపోయింది. విమానాశ్రయం ధ్వంసమైంది. నేవీ నావిగేషన్‌ విచ్ఛిన్నమైంది. సాక్షాత్తూ తుపాను సమాచారాన్నిచ్చే రాడార్‌ వ్యవస్థే నీటమునిగింది. సెల్‌ టవర్లు కుప్పకూలాయి. కరెంటు లేదు. నగరంలోనే ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఒకరి సమాచారం మరొకరికి తెలియదు.

ఒకదశలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలికి అపార్టుమెంట్లు నిలువునా ఊగిపోయాయి.
నగరంలో ఏం జరిగిందో ఇంకా ఎవరికీ పూర్తిగా తెలియదు. ప్రస్తుతానికి కనిపించిన వాటిలో 90 శాతం కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. కాస్తా ఉపశమనం, ఊరట కలిగాయి. మధ్యాహ్నం పూడిమడక వద్ద తుఫాను కన్ను తీరాన్ని దాటడంతో గండం గడిచిందని అనుకున్నారు. బయటికొచ్చి పరిసరాలను చూసుకున్నారు. మళ్ళీ తుఫాను విజృంభించింది.రాత్రి పది దాటినా తగ్గలేదు! కురుస్తూనే ఉంది. పెనుగాలులు వీస్తూనే ఉన్నాయి. విశాఖ, గంగవరం, భీమిలి పోర్టులలో తీవ్ర నష్టం సంభవించింది.

#BreakingNews #Hudhud Exclusive photo of cyclone damages from Vizag Airport Terminal. Pic: Anshul Anand pic.twitter.com/KgZ1viQPe2
— Anantha Krishnan M (@writetake) October 13, 2014

తుఫాను బీభత్సం

తుఫాను బీభత్సం

హుధుద్ తీవ్ర పెను తుఫాను ప్రభావంతో ఉత్తరకోస్తాలోని శాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, ఉభయ గోదావరిజిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. విశాఖ విమానాశ్రయం ఇలా

తుఫాను బీభత్సం

తుఫాను బీభత్సం

తుఫాను కారణంగా 180-200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. వైజాగ్ అతలాకుతులమైంది. తుఫానుకు ఐదుగురి మృతి చెందారు. రాజమండ్రి ఇలా కనిపించింది.

తుఫాను బీభత్సం

తుఫాను బీభత్సం

విశాఖలో అపార్టుమెంట్లు కదిలిపోయాయి. టవర్లు, స్తంభాలు కూలిపోయాయి. వృక్షాలు నేలమట్టంమయ్యాయి. విశాఖలో అపార నష్టం వాటిల్లింది.

తుఫాను బీభత్సం

తుఫాను బీభత్సం

విశాఖలో కరెంటు లేదు, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది. ప్రజలు ఇళ్లలోనే బందీలయ్యారు. విశాఖ నుంచే పాలన సాగించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

తుఫాను బీభత్సం

తుఫాను బీభత్సం

విశాఖ దిక్కుతోచని దీనావస్థలో చిక్కుతుంది. చిమ్మ చీకటి అలుముకుంది. ఉక్కు నగరం గజగజ వణికిపోయింది.

తుఫాను బీభత్సం

తుఫాను బీభత్సం

రోడ్ల వంటి మౌలిక సదుపాయాలన్నీ ఛిన్నాభిన్నమైపోయాయి. విశాఖను జలఖడ్గం కాటేసింది. విశాఖ విలవిలలాడింది.

తుఫాను బీభత్సం

తుఫాను బీభత్సం

విశాఖపట్నం తుఫాను తాకిడికి రెక్కలు విరిగిన పక్షిలా విలవిలలాడింది. చెట్లు కుప్పకూలాయి. తీవ్రమైన భయాందోళనల మధ్య గజగజ వణికింది.

తుఫాను బీభత్సం

తుఫాను బీభత్సం

విశాఖలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా కూలిన చెట్లు, విరిగిపడిన విద్యుత్తు స్తంభాలు

తుఫాను బీభత్సం

తుఫాను బీభత్సం

విశాఖలో తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దాదాపు 20 లక్షల మంది జీవితం స్తంభించిపోయింది. ప్రాణాలు గుప్పిట పట్టుకున్నారు.

తుఫాను బీభత్సం

తుఫాను బీభత్సం

విశాఖపట్నం సోమవారం ఉదయం నుంచి కాస్తా ఊరట పొందుతోంది. ప్రస్తుతం విశాఖ పట్నం సాధారణ స్థితికి చేరుకుంది.

తుఫాను భీభత్సం

తుఫాను భీభత్సం

పశ్చిమ గోదావరి జిల్లాను కూడా హుధుద్ తుఫాను వణికించింది. ప్రజలు సముద్రానికి దండం పెట్టుకుని కాపాడాలని కోరుకున్నారు.

తుఫాను బీభత్సం

తుఫాను బీభత్సం

పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చెట్లు కూలిపోయాయి. రోడ్డు రవాణా వ్యవస్థ దెబ్బ తిన్నది. భారీ వర్షాలు కురిశాయి.

తుపాను బీభత్సం

తుపాను బీభత్సం

పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సహాయక శిబిరంలో ఇలా భోజనాలు అందించారు. ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+