ఏపీ తీరం వైపు తరుముకొస్తోన్న సూపర్ సైక్లోన్- మహోగ్రం- అక్కడ స్కూళ్లకు సైతం సెలవులు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. తుఫాను రూపం దాల్చుతోంది. క్రమంగా అది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 28వ తేదీన ఏపీలోని బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ పరిణామంతో ఏపీ, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలు శరవేగంగా చర్యలు తీసుకుంటోన్నాయి.

తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న ఈ తుఫానుకు ప్రపంచ వాతావరణ సంస్థ ఆర్ణబ్ అని నామకరణం చేసింది. బంగ్లాదేశ్ ఈ పేరును సూచించింది. దీనికి సముద్రం అని అర్థం.

Cyclone in the Bay of Bengal set to intensify into a severe today and into a super cyclone by Oct 26

తుఫాన్ ముప్పు తీవ్రంగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీరంపై తుఫాను ప్రత్యక్ష ప్రభావం చూపనుండటంతో యంత్రాంగం రక్షణ చర్యలను వేగవంతం చేసింది. సముద్రంలో అలల ఉధృతి పెరుగుతుండటంతో విశాఖ సహా చెన్నై, నాగపట్నం, కడలూరు, కారైకాల్, పంబన్, తూత్తుకుడితో సహా తొమ్మిది ప్రధాన ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరిక సూచికలను ఎగురవేశారు.

ఆర్ణబ్ తుఫాన్.. కాకినాడ- గోపాల్ పూర్ మధ్య తీరం దాటే ఛాన్స్ : కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆర్ణబ్ తుఫాన్.. కాకినాడ- గోపాల్ పూర్ మధ్య తీరం దాటే ఛాన్స్ : కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తుఫాను కదలికలు ఏపీ వైపు ఉన్నప్పటికీ దక్షిణ ఒడిశాలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాయగడ, కోరాపుట్, మల్కాన్‌గిరి, గజపతి, గంజాం జిల్లాలకు అక్టోబర్ 28న రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ పరిస్థితుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ అయిదు జిల్లాల్లో అక్టోబర్ 28, 29 తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ సీరియస్ వార్నింగ్..!!
బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ సీరియస్ వార్నింగ్..!!

విపత్తు నిర్వహణ కోసం 60 ఒడిశా స్టేట్ డిజాస్టర్ టీమ్, 17 ఎన్డీఆర్‌ఎఫ్, 225 అగ్నిమాపక బృందాలను రంగంలోకి దించారు. గంజాం జిల్లాలోనే 100 తుఫాను షెల్టర్లతో పాటు 1,000 తాత్కాలిక పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆసుపత్రుల్లో అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

టీమిండియాతో టీ20 సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ
టీమిండియాతో టీ20 సిరీస్ వేళ.. న్యూజిలాండ్ కు ఎదురుదెబ్బ

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై పడిన చెట్ల తొలగింపు పనులను చేపట్టేందుకు ఇంజినీరింగ్ బృందాలు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. అక్టోబర్ 29 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని, అధికారిక వర్గాల నుంచి వచ్చే ముందస్తు హెచ్చరికలను మాత్రమే పాటించాలని విపత్తు నిర్వహణ శాఖ విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+