Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MONTHA CYCLONE: బీ అలెర్ట్.. మరి కాసేపట్లో తీరం దాటనున్న 'మొంథా'

'మొంథా' తీవ్ర తుపాను కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు YSR కడప జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 31 వరకు సెలవులు ప్రకటిస్తూ ఈ జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని అన్ని RJDIES, DIEO లు, RIOలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు ప్రకటించిన సెలవుల షెడ్యూల్ ప్రకారం సెలవు రోజుల్లో విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉండేలా.. ఏ సంస్థ పనిచేయకుండా చూసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మరింత సహాయం కోసం అన్ని RJDIES, DIEOలు , RIOలు జిల్లా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. ఎమర్జెన్సీ సమయంలో సంప్రదించేందుకు ‪+91 63053 13558‬, ఈ-మెయిల్: [email protected] ఇచ్చారు.

మరోవైపు కాకినాడ- మచిలీపట్నం మధ్య మొంథా తీవ్ర తుపాను తీరం తాకింది. అంతర్వేదిపాలెంలో తీరం తాకింది. పూర్తిగా తీరం దాటడానికి 4 గంటల సమయం పట్టనుంది. రాజోలు అల్లవరం మధ్య తుఫాన్‌ ఉంది. అంతర్వేది వద్ద భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రపు అలలు లైట్‌ హౌస్‌ కట్టడాలను తాకుతున్నాయి. ఇక మచిలీపట్నానికి 20 కి. మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం అయిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడకు 110 కి. మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం అయిందని వివరించారు. అలాగే విశాఖకు 220 కి. మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం అయినట్లు వెల్లడించారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

ఇక అక్టోబర్ 29 బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుపాను ధాటికి కోస్తాంధ్రలోని గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి. రాబోయే 8- 10 గంటలు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని అధికారుల హెచ్చరికలు ఇచ్చారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10 సె. మీ. నుంచి 20 సెం. మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గంటకు 110 కి. మీ. వేగంతో గాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు గుడివాడలో తుఫాన్‌ ప్రభావంతో పలుచోట్ల ప్రధాన రహదారుల్లో చెట్లు కూలిపోయాయి. ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. గుడివాడ- ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెట్లు నేలకూలాయి. దీంతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రోడ్లపై కూలిన చెట్లను విపత్తు సహాయక బృందాలు తొలగిస్తున్నాయి. అలాగే తుపాను ధాటికి రాజోలు నియోజకవర్గం అంధకారంలోకి వెళ్లింది. పలు చోట్ల సెల్‌ టవర్స్‌ దెబ్బతిన్నాయి.

Cyclone Montha Inter Colleges Shut in Affected Districts Landfall in 3-4 Hours

మరోవైపు 'మెుంథా' తీవ్ర తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంగళవారం రాత్రికి తుపాను తీరాన్ని దాటనుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు బృందాలను పంపాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. పంటనష్టంపై కేంద్రానికి వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే మొంథా తుపాను వియజనగరం జిల్లాలోలోని గుర్ల KGBV లో షార్ట్ సర్య్కూట్ అయింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా 30 మంది విద్యార్థినులు విద్యుత్యాఘానికి గురయ్యారు. వారిలో ఐదుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+