తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, తాజా హెచ్చరికలు..!!
మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఈరోజు (బుధవారం) తుపానుగా బలపడింని వెల్లడించింది. వీటి ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్రఅల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసింది. రెండు వాయుగుండాలు ఉత్తర తమిళనాడు తీరం దిశగా కదల నున్నాయని అంచనా వేస్తున్నారు.

ఆ తర్వాత కోస్తాంధ్ర వైపునకు చేరుకుని బలహీనపడనున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 1న తెలంగాణలో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ ప్రభావంతో నవంబర్ 29 - డిసెంబర్ 2 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తాజా అంచనాలు వెల్లడించారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో చలి తగ్గింది.
మెదక్‌లో 13.8 డిగ్రీలు, పటాన్ చెరువులో 14.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 14.7 డిగ్రీలు, హయత్ నగర్‌లో 15 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 17 డిగ్రీలు, హనుమకొండలో 17.5 డిగ్రీలు, రామ గుండంలో 17.5 డిగ్రీల చలి నమోదైంది. కాగా, రానున్న వారం రోజులు వాయుగుండం.. తుఫాను హెచ్చరికలతో వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications