బంగాళాఖాతంలో పొంచివున్న శక్తి తుఫాన్: ఏపీకి భారీ వర్షాలు

Cyclone Shakti: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే బంగాళాఖాతాన్ని తాకాయి. బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులకు సమీపించాయి. అండమాన్ ఉత్తర సముద్రంలో ప్రవేశించాయని, అవి మరింత చురుగ్గా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని అటు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇంకొద్ది రోజుల్లో అరేబియా, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలు అండమాన్- నికోబార్‌ అంతటా రుతు పవనాలు విస్తరించనున్నాయి. క్రమంగా- జూన్ 1వ తేదీ కంటే ముందే అంటే.. మే 27 నాటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వివరించింది.

Cyclone Shakti brewing over Bay of Bengal near Andaman

దీని ప్రభావంతో ఏపీలో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఏజెన్సీ, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో బుధవారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కడప, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

దీనికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రాయలసీమలోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తాలు కురిశాయి.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో- 54 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా నిడమర్రు- 54, కాకినాడ జిల్లా కాజులూరు- 42 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసింది. ఇదే తరహా వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నట్లు విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.

ఈ పరిస్థితుల మధ్య ఏపీకి మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశాలు లేకపోలేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నెల 20- 22వ తేదీ నాటికి ఇది మరింత బలపడనుంది.. అల్పపీడనంగా మారనుంది. 23 నుంచి 28వ తేదీల మధ్య తుఫాన్ గా ఆవిర్భవించడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది.

దీనికి శక్తి అని పేరు పెట్టారు (Cyclone Shakti). బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం గగనతలంపై 1.5 నుంచి 7.5 కిలోమీటర్ల ఎత్తున ఆవరించింది ఉందీ ఆవర్తనం. ఇది మరింత బలపడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. మూడు రాష్ట్రాలు- ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ పై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

ఉత్తరాంధ్ర, ఒడిశా పొడవునా, పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంత జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. బంగ్లాదేశ్ లోని ఖుల్నా, ఛట్గోగామ్ పైనా ఈ శక్తి తుఫాన్ (Shakti Cyclone) ప్రభావం చూపుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడితే.. సీజన్ లో తొలి సైక్లోన్ ఇదే అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+