హైదరాబాద్ విస్తరణపై డిఎస్: రేణుక హీట్ (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని, ఈ విషయమై సీమాంధ్ర నేతలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడుతూ వారి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఒక తీర్మానం చేశారు. ఆదివారం సాయంత్రం మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్ హౌస్‌లో వారు భేటీ అయ్యారు. పలు తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ అంశం చర్చకు వచ్చినప్పుడు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించడం కుట్రగా కొందరు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ కార్పోరేషన్‌గా ఉన్న దానిని గ్రేటర్ హైదరాబాద్ చేశారని, తర్వాత హెచ్ఎండిఏ అన్నారని, దాని పరిధిని మోసపూరితంగా పెంచుతున్నారని పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ అన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా అంగీకరించేది లేదన్నారు.

తెలంగాణ ప్రాంత నేతల సమావేశానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తొలిసారి రావడం గందరగోళానికి దారి తీసింది. ఆమె రాకపై ఎంపి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దామోదర్ రెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వడం ఇడ్లి, దోశ వేసినంత సులువు కాదన్న ఆమె మాటలపై వివరణ ఇవ్వాలని మరికొందరు నేతలు పట్టుబడ్డారు. ఈ సమయంలో మిగతా జానా రెడ్డి వంటి ఇతర నేతలు కల్పించుకొని నచ్చజెప్పారు.

జానా రెడ్డి

జానా రెడ్డి

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నాయకులు ఆదివారం సాయంత్రం మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీ నాలుగు గంటల పాటు జరిగింది.

తీర్మానాలు

తీర్మానాలు

విభజనకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ కాంగ్రెసుకు దక్కేందుకు ఏం చేయాలనే విషయమై భేటీలో చర్చించారు.

విలేకరులతో..

విలేకరులతో..

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నాయకులు ఆదివారం సాయంత్రం మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్ హౌస్‌లో భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతున్న నేతలు.

రేణుకా చౌదరి

రేణుకా చౌదరి

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మొదటిసారి వచ్చారు. పొన్నం ప్రభాకర్, దామోదర్ రెడ్డిలు అభ్యంతరం తెలిపినా మిగతా నేతలు సముదాయించారు.

నేతల భేటీ

నేతల భేటీ

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నాయకులు ఆదివారం సాయంత్రం మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్ హౌస్‌లో భేటీ అయిన దృశ్యం.

జై తెలంగాణ

జై తెలంగాణ

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నాయకుల భేటీకి తొలిసారి రేణుకా చౌదరి రావడంతో కొందరు అభ్యంతరం తెలపడంతో ఆమెకు మద్దతుగా పలువురు బయటి నుండి వచ్చి నినాదాలు చేశారు.

రేణుకా చౌదరి

రేణుకా చౌదరి

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మొదటిసారి వచ్చారు. సమావేశం నుండి వెళ్తున్న రేణుక.

జానా, గీతా రెడ్డి

జానా, గీతా రెడ్డి

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నాయకులు ఆదివారం సాయంత్రం మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్ హౌస్‌లో భేటీ అయ్యారు. భేటీలో మంత్రులు జానా రెడ్డి, గీతా రెడ్డి, మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్.

పొన్నంతో జానా

పొన్నంతో జానా

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నాయకులు ఆదివారం సాయంత్రం మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్ హౌస్‌లో భేటీ అయ్యారు. భేటీలో పొన్నం ప్రభాకర్‌తో మాట్లాడుతున్న జానా రెడ్డి.

నేతల హడావుడి

నేతల హడావుడి

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నాయకులు ఆదివారం సాయంత్రం మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్ హౌస్‌లో భేటీ అయిన సందర్భంగా హడావుడి.

విలేకరులతో..

విలేకరులతో..

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నాయకులు ఆదివారం సాయంత్రం మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్ హౌస్‌లో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+