దాచేపల్లి రేప్ ఘటనలో ట్విస్ట్!: ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పిన నిందితుడు?
Recommended Video

గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కథువా ఘటన తర్వాత ఉరిశిక్ష చట్టాలను అమలులోకి తెచ్చినా పరిస్థితిలో మార్పు రాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే, దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడు సుబ్బయ్య తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పడం కలకలం రేపుతోంది. బుధవారం సుబ్బయ్య తన బంధువులకు ఫోన్ చేసి.. తాను చనిపోతున్నట్టు చెప్పాడని సమాచారం.

ఎందుకింత అఘాయిత్యానికి పాల్పడ్డావని బంధువులు అతన్ని ప్రశ్నించగా.. ఇక తాను బతకనని, చనిపోతున్నానని చెప్పాడట సుబ్బయ్య. ఈ విషయం బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో కృష్ణానది తీర గ్రామమైన తంగెడ సెల్ టవర్ ప్రాంతంలో అతను ఉన్నట్టు గుర్తించారు.
సుబ్బయ్య నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గజ ఈతగాళ్లతో పాటు పడవలను రంగంలోకి దించి అతని కోసం నదిలో ముమ్మరంగా గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications