వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై 'దాడి': అధిష్టానం దృష్టిలో ఎప్పుడో: టిపై కావూరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dadi Veerabhadra Rao
హైదరాబాద్/ఏలూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు దాడి వీరభద్ర రావు ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని చంద్రబాబు కార్యక్రమానికి ప్రజా గర్జన టైటిల్ ఏమాత్రం సరిపోదన్నారు. ప్రజాగర్జనలో టిడిపి సమైక్య తీర్మానం చేస్తేనే ప్రజలు చంద్రబాబును నమ్ముతారన్నారు.

అధికారం కోసం చంద్రబాబు పూటకోమాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయనకు ధైర్యముంటే విభజన గర్జన అని పేరు పెట్టాలని సవాల్ చేశారు. ఆయన ఆంధ్రుడై ఉండి కూడా సిగ్గుపడే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు కారకుడు చంద్రబాబే అన్నారు.

రెండు రోజుల క్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసినప్పుడు సమన్యాయం అన్నారే కానీ, రాష్ట్ర విభజన ఆపలేదన్నారు. విభజనను ఆపాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదో చెప్పాలన్నారు. సమన్యాయం అని చంద్రబాబు అడగడం విభజనకు అంగీకరించడమే అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఏ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉండాలో బాబు తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు.

విభజనపై కావూరి

అధిష్టానం దృష్టిలో రాష్ట్రం ఎప్పుడో విడిపోయిందని కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు ఏలూరులో అన్నారు. విభజనను ఆపుతామనే నమ్మకం తమకు ఉందన్నారు. రాష్ట్ర విభజన శాస్త్రీయంగా లేదన్నారు. పోలవరం సాఫీగా సాగాలంటే రాష్ట్రం విడిపోతే భద్రాచలంను సీమాంధ్రలోనే కలపాలన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర వెనుకబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

వస్తుంటారు.. పోతుంటారు: షబ్బీర్ అలీ

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన జనవరి 10వ తేదీలోపు చర్చ ముసుస్తుందని, ఆ తర్వాత పిసిసి నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ హైదరాబాదులో అన్నారు. వలసలతో పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. 129 ఏళ్ల కాంగ్రెసులోకి ఎందరో వస్తుంటారు.. ఎందరో వెళ్తుంటారన్నారు.

English summary
YSR Congress Party senior leader Dadi Veerabhadra Rao on Sunday lashed out at Telugudesam Party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X