దళిత విద్యార్థి ఆత్మహత్య: వివక్షే వల్లనే? (ఫొటోలు)
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఎం. వెంకటేష్ అలియాస్ వెంకటేశ్వర్లు వివక్ష కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 26 ఏళ్ల పిహెచ్‌డి స్కాలర్ వెంకటెశ్వర్లు విషం పుచ్చుకుని విశ్వవిద్యాలయంలోని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
వెంకటేశ్వర్లు రంగారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందినవాడు. పిహెచ్‌డి ద్వితీయ సంవత్సరం విద్యార్థి అయిన వెంకటేశ్వర్లు విశ్వవిద్యాలయంలోని హై ఎనర్జీ మెటిరీయల్స్‌లో అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ రిసెర్స్ సహకారంతో నడుస్తున్న రిసెర్స్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో పరిశోధన చేస్తున్నాడు.
విద్యార్థి ఆత్మహత్యతో విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఆగ్రహించారు. ఒక్కసారిగా వైస్ చాన్సలర్ లాడ్జిని ముట్టడించారు. వెంకటేష్ ఆత్మహత్యకు వివక్షనే కారణమని వారు విమర్శించారు. ప్రతిభావంతుడైన వెంకటేష్ మూడు అకడమిక్ పరిశోధనా పత్రాలను కూడా ప్రచరించాడు. అయినా, సంస్థ అతనికి శాశ్వత ప్రాతిపదికపై గైడ్‌ను ఇప్వలేదు.
విద్యార్థులు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఆందోళన ప్రారంభిస్తే విసి రామకృష్ణ రామసామి సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రకటన ఇచ్చారు. విశ్వవిద్యాలయం అకడమిక్ వ్యవస్థ వెంకటేష్, ఇతర విద్యార్థుల మృతికి కారణమని ఆయన అంగీకరించారు. విద్యార్థుల మరణాలను ఆపడానికి తాము తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విచారణకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

విషాద సంఘటన ఇక్కడే
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పిహెచ్‌డి స్కాలర్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకుంది ఇక్కడే. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వాతావరణం ఈ సంఘటన విషాదకరంగా మారింది.

ఆగ్రహించిన విద్యార్థులు
విద్యార్థి మరణంతో విశ్వవిద్యాలయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆవేదనతో కూడిన ఆగ్రహంతో విద్యార్థులు నిరసనకు దిగారు.

కుటుంబ సభ్యులు శోకసంద్రంలో..
రెక్కలొచ్చిన పిల్లవాడు అకాల మరణం చెందడంతో వెంకటేష్ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. వారి బాధ వర్ణనాతీతంగా ఉంది.

వేడెక్కిన వాతావరణం..
విషాదం, ఆగ్రహం ముప్పిరిగొన్న వాతావరణంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వేడెక్కింది. విద్యార్థులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు.

అనంతలోకాల్లో కలిసిపోయి..
విశ్వవిద్యాలయం వివక్ష కారణంగా, తనకు పర్యవేక్షకుడిని నియమించకపోవడం వల్ల మనస్తాపానికి గురైన వెంకటేష్ ప్రాణాలు తీసుకుని ఇలా నిర్జీవంగా కనిపించాడు.












Click it and Unblock the Notifications