రిజర్వేషన్లపై మంట పుట్టించిన పవన్ వ్యాఖ్యలు: మహేష్ కత్తి గట్టి పంచ్, బహుజన రచయితల ఆగ్రహం..
అతని బుర్రలో సరుకు లేదనే విషయం ఫ్యాన్స్ కి అంతగా తెలిసిపోయి, అతని ఫాలోయింగ్ పడిపోతూ ఉంటుంది. దానికి లేటేస్ట్ ఎగ్జాంపుల్ - రిజర్వేషన్లపై చేసిన కామెంట్స్.
Recommended Video

హైదరాబాద్: సమస్యలపై లోతైన అవగాహన లేకుండా.. ఇంటలెక్చువల్ స్టేట్‌మెంట్స్ ఇచ్చామనే భ్రమలో చాలామంది నాయకులు కనిపిస్తుంటారు. వారికి భజన చేయడానికి అనుకూల వర్గాలు ఎలాగూ ఉండనే ఉంటాయి. కానీ సోషల్ మీడియా అంటూ ఒకటి ఏర్పడ్డ తర్వాత.. ఏ స్థాయి వ్యక్తినైనా సరే నిర్ద్వంద్వంగా చీల్చి చెండాడే రోజులు వచ్చాయి.
నేతల అవగాహన రాహిత్యాన్ని, రాజకీయాలకు వారు చెబుతున్న వక్రభాష్యాల్ని గుడ్డలిప్పి నిలబెడుతున్నారు నెటిజెన్స్. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మరోసారి నెటిజెన్స్ సెగ తగిలింది. రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు దళిత సామాజిక వర్గంలో మంటపుట్టించాయి. ఏం తెలుసని పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. ఫిలిం క్రిటిక్, బహుజనవాదిగా మహేష్ కత్తి కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు.

మహేష్ కత్తి ఏమన్నారు:
'రాజ్యాంగం మీద అవగాహన, రాజకీయ పరిణతి చాలా దూరం. కనీసం కామన్ సెన్స్ లేని ఇలాంటి స్టేట్‌మెంట్స్ పవన్ కల్యాణ్ తెలియనితనాన్ని సూచిస్తున్నాయి. తరతరాల రిజర్వేషన్ల అమలులోని అవకతవకలతో పోరాడుతూ, ఇప్పటికీ వివక్ష అనుభవిస్తున్న కోట్ల మంది దళితుల గురించి మాట్లాడని ఇతడు.. దళిత సమస్యలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగినప్పుడు కనీసం ట్వీట్ చెయ్యని ఇతను.. ఇప్పుడు రిజర్వేషన్ల గురించి, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు' మహేష్ కత్తి ఘాటుగా స్పందించారు.
'కనీసం 1% కూడా లేని క్రిమిలేయర్ పెద్ద సమస్య అన్నట్టు పోజులిస్తున్నాడు. అవగాహనా రాహిత్యం, మూర్ఖత్వం మాట్లాడిన అక్షరం అక్షరంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడే కదా, కాపులు తమ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. ముద్రగడ గురించి మాట్లాడమంటే, సెన్సిటివ్ విషయాలపై స్పందించను అనే ఈ పలాయనవాది, దళితుల రిజర్వేషన్ల నిర్మూలనే ధ్యేయంగా ఉన్నట్టు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో చూస్తే, ఇతని దళిత వ్యతిరేకత సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జనసేన పంథా అయితే, ఇదే ఇతగాడి "స్థాయి" అయితే, మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం' అని మహేశ్ కత్తి తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు.

ఇండస్ మార్టిన్ (బహుజన రచయిత)
అంబేద్కర్‌కు నిజమైన నివాళంటే కులాలే లేని సమాజాన్ని సృష్టించడమే.
ముందు ఆ 'కాపు ' కులం కార్డు వాడటం మాను. అప్పుడు రణగొణసేన ఏం ఖర్మా, నీ సినిమా చూసే ఒక్కడుండా నన్నడుగు.
అక్షరం ముక్క చదువుకోనోడూ, అంబేద్కర్ రాతల అట్టల్ని కూడా తాకని ప్రతోడూ రిజర్వేషన్ల గురించి సందేశాలివ్వడమే!..

సుమన్ దామెర(డీఎస్‌యూ-దళిత్ స్టూడెంట్ యూనియన్)
ఇదొక్కటి సరిపోతది బై PK రాజకీయాలకు పనికి రాడు అనుకోవడానికి. PK ఫాన్స్ మీరన్న చెప్పండి మీవోనికి రాజకీయాలు అంటే సైనిమా లో వీరోచిత పాత్రలు పోషించినట్టు కాదు బై. సైనిమా లో లెక్క ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు అన్నట్టు ఉండదు రాజకీయాలలో.
ఒకవైపు కాపుల సమస్యలు (Reservations) పరిష్కరించమంటూ మరో వైపు Reservations లేని సమాజం కావలంటూ కుహాన ఆదర్శవాదం వినిపిస్తున్న గాలి (పవన) కళ్యాణ్ సమాజాన్ని ఆయన గీసుకున్న జనసేన ఫ్రేమ్ లో నుంచి చూస్తున్న విధానాన్ని బట్టి సగటు బుద్ధిజీవికి అర్థం అయ్యేది ఎందంటే అతనికి మానసిక సమతుల్యత లేదు అని.
ఒకవేళ అట్ల అనిపించకపోతే గాలి గారి గాలి మాటలు గాలిలో మేడలు కట్టినట్టే. ఇప్పటికయినా మించిపోయింది లేదు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాల్లో భారత రాజ్యాంగం ప్రతులు లభిస్తాయి. కాకపోతే దాన్ని ఏదో పంచాంగం లాగా లేదా పంచ్ డైలాగ్ లెక్క కాకుండా దమాక్ పెట్టి సదువుతే నీ తిక్కకు లెక్క దొరుకుతది అట్లా కాదంటే మెంటల్ దవాఖాన కు పోయి మానసిక పరిస్థితిని సక్కదిద్దుకో. ఖబర్దార్

నూకతోటి రవికుమార్(బహుజన రచయిత)
మొన్నటివరకూ ఇతన్ని చిరంజీవి తమ్ముడు అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తోంది. ఇతడు అమిత్ షా రక్త బంధువు అని. పీకే ఏపీ అమిత్ షా. దేశంమంతా ఆయన్ని తిప్పే కష్టం నుంచి తప్పించే బాద్ షా.
పీకే ఏపీ లో కమల దళ వికాసం కోసం కష్టపడుతున్న కలల బేహారి. ఐనా ఒక్క ఫ్యాన్స్ తప్ప ఈయనగారి కోసం చొక్కాలు చించుకునే వాళ్ళెవరూ?

హనీఫ్ మహమ్మద్ షేక్(నెటిజెన్)
PK ఫ్యాన్ ఫాలోయింగ్ కి, అతని మౌనానికి అనులోమానుపాత సంబంధం ఉంది. అంటే.. అతను ఎంత సైలెంటుగా ఉంటే, అతనికి అంత ఫాలోయింగ్ పెరుగుతుంది. అలాకాక.. అతను నోరు తెరిచి వివిధ సామాజిక అంశాలపై తన అమూల్య అభిప్రాయాలు ఎంతగా వెలిబుచ్చాడంటే, అతని బుర్రలో సరుకు లేదనే విషయం ఫ్యాన్స్ కి అంతగా తెలిసిపోయి, అతని ఫాలోయింగ్ పడిపోతూ ఉంటుంది. దానికి లేటేస్ట్ ఎగ్జాంపుల్ - రిజర్వేషన్లపై చేసిన కామెంట్స్.












Click it and Unblock the Notifications