బాలయ్యపై దళితుల ఆగ్రహం: బుజ్జిగించిన నిమ్మల

అనంతపురం: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నందమూరి హీరో బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షిలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించకుండా బాలకృష్ణ వెళ్లిపోవడంతో దళితులు మంగళవారంనాడు ధర్నాకు దిగారు.

హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పొల్గొనడానికి బాలకృష్ణ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన లేపాక్షి మీదుగా హిందూపురం వెళ్తుండగా లేపాక్షి జాతీయ రహదారిపై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించకుండా ముందుకు వెళ్లిపోయారు.

Daliths protest against Balakrishna

లేపాక్షి మీదుగా వెళ్లే సమయంలో బాలకృష్ణ ఆ విగ్రహం వద్ద ఆగి నివాళులు అర్పిస్తారని చెప్పడంతో విగ్రహాన్ని పూలమాలలో అలంకరించి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే, విగ్రహం పక్క నుంచే వెళ్తూ కూడా ఆయన అక్కడ ఆగలేదు.

దాంతో ఆగ్రహించిన దళితులు అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. బాలయ్య వెనక్కు వచ్చి పూలమాల వేసి నివాళులు అర్పించే వరకు ఆందోళనను విరమించేది లేదని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న హిందూపురం పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప లేపాక్షికి వచ్చి దళితులను బుజ్జగించి విగ్రహానికి నివాళులు అర్పించి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+