దాసరి కష్టాలు: 75 పైసలు చెల్లించలేక స్కూల్ బంద్ , బాలానగర్ కు కాలినడకనే
తీవ్రమైన ఆర్థిక సమస్యలతో దర్శకరత్న దాసరినారాయణరావు 6వ, తరగతిలోనే చదువును ఆపేశారు.అయితే 75 పైసల ఫీజును స్నేహితులు చందాలు పోగుచేసి ఇస్తే ఆయన తిరిగి చదువును కొనసాగించారు. దాసరినారాయణరావు అనేక కష్టాలను ఎ
హైదరాబాద్: తీవ్రమైన ఆర్థిక సమస్యలతో దర్శకరత్న దాసరినారాయణరావు 6వ, తరగతిలోనే చదువును ఆపేశారు.అయితే 75 పైసల ఫీజును స్నేహితులు చందాలు పోగుచేసి ఇస్తే ఆయన తిరిగి చదువును కొనసాగించారు. దాసరినారాయణరావు అనేక కష్టాలను ఎదుర్కోన్నారు. సినిమారంగంలో ప్రారంభదశలో ఈసడింపులను ఎదుర్కొన్నారు. నాటకరంగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఆయనను సినిమారంగంలో అడుగుపెట్టిన తొలిరోజు ఆయన చేదు అనుభవాన్ని చవిచూశారు.
చిన్నతనంలోనే నాటకాలంటే ఆయనకు చాలా ఇష్టం.కష్టపడి చదువుకోవడంతో పాటు నాటకాలను వేసేవారు. అయితే పాలకొల్లులో అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించారు. అయితే ఆస్తిపాస్తులు బాగానే ఉండేవని దాసరి తన సన్నిహితులతో చెప్పేవారు.
అయితే దాసరి 6వ, తరగతికి వచ్చేసరికి ఆయన కుటుంబం బాగా ఆర్థికంగా చితికిపోయింది. ఒకానొకదశలో చదువును మానేసి పనిలోకెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది.ఆర్థిక సమస్యలతో ఆయన స్కూల్ ను మానేశాడు.
కష్టాలనుండి అంచెలంచెలుగా ఎదిగినా పెద్ద దర్శకుడిగా ఎదిగినా ఆయన సినీ రంగంలో కష్టాలకు గురయ్యేవారికి ఎప్పుడూ కూడ అండగా ఉండేవాడు.సినీ పరిశ్రమలో ఏ కష్టమొచ్చినా దాసరి వద్దకు వెళ్ళాలనే పరిస్థితి ఉంది.

డబ్బుల్లేక స్కూల్ మానేశాడు
దాసరి నారాయణరావు 6వ, తరగతి చేరుకొనేసరికి ఆయన కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయింది. చదువు మానేసి పనిలోకెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది. అయితే ఆయన స్కూల్ టీచర్ దాసరిని తిరిగి స్కూల్లో చేరేలా తండ్రితో మాట్లాడి ఒప్పించాడు.ఒకరోజు దాసరి ఇంటి ముందే వారి స్కూల్ టీచర్ సైకిల్ పాడైంది. అయితే సైకిల్ ను బాగుచేయడానికి దాసరి మాస్టారికి సహయం చేశాడు.అయితే స్కూల్ కు మానివేసిన పరిస్థితులను మాస్టారికి దాసరి వివరించారు. అయితే 75 పైసల ఫీజు కట్టే స్థోమత లేక స్కూల్ ను మాన్పించాడు దాసరి తండ్రి. మాస్టర్ చొరవతో తాను తిరిగి స్కూల్ కు వెళ్ళినట్టు దాసరి చెప్పారు.

తోటి విద్యార్థులు స్కూల్ ఫీజు కట్టారు.
75 పైసల స్కూల్ ఫీజు లేకపోవడంతో స్కూల్ కు వెళ్ళి తన పరిస్థితిని వివరించిన మాస్టర్ తోచిన సహాయం చేయాలని తోటివిద్యార్థులను కోరారు.అయితే తోటి విద్యార్థులు తాము తెచ్చుకొన్న డబ్బులను దాసరికిఇచ్చారు. అలా దాసరి స్కూల్ ఫీజు కట్టి తిరిగి చదువుకొన్నాడు. అయితే 6వ, తరగతిలో ఉత్తమ విద్యార్థిగా దాసరి నారాయణరావు బహుమతిని గెలుచుకొన్నాడు.

టిఫిన్ కోసం హిందీ నేర్చుకొన్నాడు
సాయంత్రం నాలుగున్నర గంటలకు స్కూల్ అయిపోతే హిందీ నేర్చుకొనేందుకు ప్రత్యేక క్లాస్ కువెళ్ళేవాడు దాసరి. అయితే ఇడ్లీ, దోసె తదితర టిఫిన్ల కోసం ఆయన హిందీ నేర్చుకొన్నాడు. హిందీ నేర్చుకొనేవారిని ప్రోత్సహించేందుకుగాను ఏదో ఒక టిఫిన్ పెట్టేవారు.అందుకే ఆయన హిందీ నేర్చుకొన్నాడు.

సనత్ నగర్ నుండి బాలానగర్ దాకా కాలినడకన పనికి
ఉద్యోగం కోసం హైద్రాబాద్ చేరుకొని ఓ చిన్న ఉద్యోగం సంపాదించాను. తెల్లవారుజామునే మూడింటికే లేచి నాలుగుచపాతీలు, పప్పుచేసుకొని బాక్స్ పెట్టుకొని నడుచుకొంటూ నాంపల్లిదాకా వెళ్ళేవాడు అక్కడ బస్సెక్కి సనత్ నగర్ లో దిగేవాడు. అక్కడ నుండి బాలానగర్ వరకు కాలినడకనే తాను పనిచేసే చోటుకు చేరుకొనేవాడు దాసరి. సనత్ నగర్ వరకే బస్సలు నడిచేవి.

బ్యాచిలర్ క్వార్టర్ కు వెళ్ళేవాడు
ఆబిడ్స్ లో రెడ్డి హస్టల్ పక్కనే రిసాలా కుర్చీ జాయ్ అనే బ్యాచిలర్స్ క్వార్టర్స్ ఉండేది, అందులో ఓ గదిలో దాసరి నాలుగు రూపాయాలకు అద్దెకు ఉండేవాడు. దాసరితో పాటు మరో ఇద్దరు కూడ అందులో ఉండేవారు. అయితే ఆబిడ్స్ వెళ్తే తాను నివసించిన ఆ ప్రాంతం వైపు వెళ్ళేవాడు దాసరి.

నిర్మాతే స్వయంగా సినిమాఛాన్స్ కోసం పిలిచారు
పాలకొల్లుకు చెందిన శ్రీ క్షీరరామ ఆర్ట్ థియేటర్ తరపున నాటకాలు వేసేవారు. హైద్రాబాద్ లో వేసిన నాటకాన్ని చూసిన నిర్మాత కృష్ణయ్య ఓ సినిమాలో అవకాశం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు.అయితే ఆ సినిమా అవకాశాన్ని వద్దని చెప్పేశాడు దాసరి.అయితే మరోసారి తన సినిమాలో హస్యనటుడి పాత్ర చేయాలంటూ ఆయన రాసిన లేఖతో దాసరి చెన్నై రైలెక్కాడు.అయితే ప్రధానహస్యనటుడి పాత్ర కాకుండా ఆయన అసిస్టెంట్ పాత్రలో దాసరి నటించారు.అయితే సినిమా పాత్రకు మేకప్ వేస్తూ మేకప్ మేన్ దాసరిని చులకనగా మాట్లాడాడు.
6.బ్యాచిలర్ క్వార్టర్ కు వెళ్ళేవాడు
-
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!












Click it and Unblock the Notifications