జనసేనలో చేరికపై తేల్చేసిన దాడిశెట్టి రాజా..!!
ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఇటు లడ్డు వివాదం కొనసాగుతున్న వేళ.. అటు వైసీపీ ముఖ్య నేతలు పార్టీ మారుతున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జనసేన లో చేరుతున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజా తన పార్టీ మార్పు పైన తేల్చి చెప్పారు.
వైసిపి లోని మాజీ మంత్రులు, గోదావరి జిల్లా కాపు నేతలు జనసేనలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ జాబితాలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేరు కూడా ఉంది. అయితే తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాజా ఖండించారు. తాను జనశంలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మద్దని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్య రీచా హైదరాబాదులో ఉండాలని త్వరలోనే అందర్నీ కలుస్తానని ప్రకటించారు.

ఈ మేరకు తుని నియోజకవర్గ పార్టీ నేతలకు సోషల్ మీడియా ద్వారా తన సమాచారం పంపించారు. తాను తునిలో లేని సమయంలో జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని రాజా వివరించారు. తొలి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తనకు సహకరించిన నియోజకవర్గ కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పారు. జగన్ హోసన్న తన కార్యకర్తలను వీడి తాను వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. ఎవరు ఇలాంటి ప్రచారం చేసిన నమ్మవద్దని.. అనారోగ్యం కారణంగానే చికిత్స కోసం హైదరాబాదులో ఉన్నానని వెల్లడించారు.
తుని వచ్చిన వెంటనే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తానని రాజా స్పష్టం చేశారు. రాజా తో పాటుగా ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు, మరో ఇద్దరు మాజీ మంత్రులు జనసేన చేరుతారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే త్రిమూర్తులు దీనిపైన స్పష్టత ఇవ్వగా ఇప్పుడు రాజా తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications