విహెచ్ డ్యాన్స్, దత్తాత్రేయ సన్నాయి (పిక్చర్స్)

హైదరాబాద్: అలయ్ బలయ్ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ నేతలు తమ కళానైపుణ్యాలకు పదును పెట్టారు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో గల జలవిహార్‌లో బిజెపి సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది.

బండారు దత్తాత్రేయ సన్నాయి ఊదుతూ అందరినీ అలరించే ప్రయత్నం చేస్తే, కాంగ్రెసు పార్టీ నాయకుడు వి హనుమంతరావు నృత్యం చేశారు. ఆయనతో పార్లమెంటు సభ్యుడు రాజయ్య అడుగులు కలిపారు. ప్రజా గాయకుడు గద్దర్ తన గళాన్ని విప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ జెఎసి నాయకులు కూడా పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల తెలంగాణ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆయన అదే రీతిలో నిర్వహించారు. రెండుగా విడిపోయి ఒక్కటిగా కలిసుందామని తెలంగాణ నాయకులు ఈ కార్యక్రమంలో సీమాంధ్ర నాయకులకు విజ్ఞప్తి చేశారు.

కొత్త రూపంలో దత్తాత్రేయ

కొత్త రూపంలో దత్తాత్రేయ

అలయ్ బలయ్ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ మంగళవారంనాడు కొత్త వేషంలో కాంగ్రెసు నేత కె. కేశవరావు, తెలంగాణ ఉద్యోగుల నేతలు దేవీ ప్రసాద్, శ్రీనివాస గౌడ్ తదితరులతో ఇలా...

రుమాలుతో దత్తాత్రేయ..

రుమాలుతో దత్తాత్రేయ..

తలకు రుమాలు చుట్టి హైదరాబాదు పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మను అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్న దత్తాత్రేయ. బిజెపి నాయకుడు లక్ష్మణ్‌ను కూడా చిత్రంలో చూడవచ్చు.

లెఫ్ట్ రైట్ కలిసింది..

లెఫ్ట్ రైట్ కలిసింది..

అలయ్ బలయ్ కార్యక్రమంలో కుడిఎడమలు కలిశాయి. సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని ఆలింగనం చేసుకుంటూ బండారు దత్తాత్రేయ

కదం తొక్కుతూ...

కదం తొక్కుతూ...

అలయ్ బలయ్ కార్యక్రమంలో కాంగ్రెసు నేత వి. హనుమంతరావు, పార్లమెంటు సభ్యుడు రాజయ్య కదం తొక్కుతూ నృత్యం చేశారు.

కెకెతో దత్తాత్రేయ ఇలా..

కెకెతో దత్తాత్రేయ ఇలా..

మంగళవారం అలయ్ బలయ్ కార్యక్రమంలో బిజెపి నేత బండారు దత్తాత్రేయ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత కె. కేశవరావుతో ఏదో మాట్లాడుతూ నవ్వుతూ ఇలా.

గద్దర్ ఇలా..

గద్దర్ ఇలా..

ప్రజా గాయకుడు గద్దర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపించడం లేదు. తెలంగాణపై కీలకమైన మార్పులు చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో ఆయన మౌనం చర్చనీయాంశంగా మారింది. అయితే అలయ్ బలయ్ కార్యక్రమంలో నవ్వుతూ ఉల్లాసంగా కనిపించారు.

వారిద్దరి నడుమ కిషన్ రెడ్డి..

వారిద్దరి నడుమ కిషన్ రెడ్డి..

తెలంగాణకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు వివేక్ ఏదో చెబుతుంటే, వారి మధ్య చిక్కుకుపోయి బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఇలా కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+