నేను అమాయకుడిని, ఇరికించారు: కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ కేసుపై డీఈ సత్యానందం

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసులో ఆకారణంగా తనను ఇరికించారని సస్పెండ్‌కు గురైన డీఈ సత్యానందం ఆవేదన వ్యక్తం చేశారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సత్యానందం గురువారం విజయవాడ న్యాయస్థానం ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఉద్యోగ సంఘం నేతగానే సీఎం చంద్రబాబు నాయుడు, ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావును కలిసినట్లు చెప్పారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ కేసులో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.

DE Satyanandam says i am innocent in call money case

కాగా, కాల్‌మనీ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న డీఈ సత్యానందానికి ఇటీవలే ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. కాల్‌మనీ కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో డీఈ సత్యానందం నాలుగో నిందితుడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యలమంచిలి రామ్మూర్తి అలియాస్ రాము, దూడల రాజేష్, భవానీ శంకర్ అరెస్టై జైలులో ఉన్నారు.

చెన్నుపాటి శ్రీను, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ళ శ్రీకాంత్‌ పరారీలో ఉన్నారు. మరోవైపు కాల్‌మనీ, సెక్స్ రాకెట్ కేసుకి సంబంధించి ఒక్క కేసులో మాత్రమే డీఈ సత్యానందం బెయిల్ పొందాడని ఏపీ డీజీపీ జేవీ రాముడు గురువారం తెలిపారు. అతనిపై ఇంకా మరికొన్ని కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.

కాల్‌మనీ, సెక్స్ రాకెట్ కేసులో విచారణ కోసం డీఈ సత్యానందంను అదుపులోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గురువారం విజయవాడలో ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన నేరాల సంఖ్యపై ఆయన మాట్లాడారు. 2014తో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య 4.23 శాతం తగ్గిందని చెప్పారు.

ఈ ఏడాది 100 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. మరో 96 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాలో 2,710 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+