ఫిరాయింపులతో కుదేలు: జానా మాటలు, జగన్ యాక్షన్
హైదరాబాద్: శానససభ్యుల ఫిరాయింపులతో తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కుదేలైపోతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిక్కచచ్చిపోతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలు ముగ్గురు తప్ప అంతా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లోకి వలస వెళ్లారు. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు క్యూ కడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు అధికార తెలుగుదేశం పార్టీలోకి బారులు తీరుతున్నారు. మే చివరినాటికి మెజారిటీ వైసిపి శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకోవాలనే లక్ష్యంతో టిడిపి పనిచేస్తోంది.
ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాల కారణంగా ఫిరాయింపులు యధేచ్ఛగా జరిగిపోతున్నాయి. ఈ విషయంపై తెలంగాణ ప్రతిపక్ష నేత కె. జానా రెడ్డి తొలుత మాట్లాడారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని, టిఆర్ఎస్ ప్రజాస్వామ్యానికి చేస్తున్న చేటును రాష్ట్రపతి దృష్టికి, ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని, సుప్రీం కోర్టులో కేసు వేస్తామని, ఢిల్లీస్థాయిలో ఈ ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

జానారెడ్డి మాటలకే పరిమితం కాగా జగన్ మాత్రం యాక్షన్‌లోకి దిగారు. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి సారథ్యంలో పార్టీ నాయకుల బృందం ఈనెల 25న ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవబోతోంది. 26న ప్రధానిని కలవడానికి కూడా నిర్ణయించుకున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లోపాలు సరిదిద్దాలనే ప్రచారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎజెండాలో ప్రధానమైంది.
'సేవ్ డెమోక్రసీ' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మూడురోజులపాటూ ఉద్యమాలు నిర్వహించాలని కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణం తీసుకుంది. ఆ రకంగా ఫిరాయింపులపై అందరి దృష్టి పడే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాచరణ చేపట్టింది.












Click it and Unblock the Notifications