Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గర్ల్‌ఫ్రెండ్‌తో వచ్చిన ఫ్రెండ్‌కు రూమిచ్చాడు, అక్కా అంటూ అత్యాచారయత్నం

కడప జిల్లా ప్రొద్దుటూరులో బిటెక్ విద్యార్థిని హైందవిని హత్యకేసును పోలీసులు చేధించారు. ఆమె కుటుంబానికి పరిచయస్తుడైన నవీన్‌కుమార్ హంతకుడని పోలీసులు తేల్చారు.

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో బిటెక్ విద్యార్థిని హైందవిని హత్యకేసును పోలీసులు చేధించారు. ఆమె కుటుంబానికి పరిచయస్తుడైన నవీన్‌కుమార్ హంతకుడని పోలీసులు తేల్చారు. అయితే కేసును పక్కదారిపట్టించేందుకు నిందితుడు బాధితురాలి నగలను, స్కూటీని దొంగిలించాడు.

కడప జిల్లా రాజుపాలెం మండలం టంగుటూరుకు చెందిన నవీన్ డిగ్రీ ఫస్టియర్ చదివే సమయంలో హైందవి ఇంటి కింది ఫోర్షన్‌లో అద్దెకు ఉంటున్నాడు.

నవీన్ హైందవిని అక్కా అంటూ పిలిచేవాడు.అంతేకాదు ఆ కుటుంబానికి నవీన్ దగ్గరయ్యాడు. నవీన్‌కు సుళ్ళూరుపేటకు చెందిన నరహరి అనే స్నేహితుడు ఉన్నాడు.

Degree student arrested on charge of killing girl

తన గర్ల్‌ప్రెండ్‌తో కాసేపు గడిపేందుకు రూమ్ కావాలని నరహరి నవీన్‌ను అడిగాడు. అయితే ఇందుకు నవీన్ కూడ అంగీకరించాడు. అయితే హైందవి ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం ఎదరుచూశాడు నవీన్.

హైందవి తండ్రి జయప్రకాష్‌రెడ్డితో కలిసి హైందవి స్కూటీపై బయటకు వెళ్ళింది. వారు బయటకు వెళ్ళిపోగానే నవీన్ తన స్నేహితుడు నరహరికి ఫోన్ చేశారు.

గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నరహరి నవీన్ రూమ్‌కు వచ్చాడు. అయితే నవీన్ తన స్నేహితుడు నరహరిని తన రూమ్‌లో వదిలేసి బండి తీసుకొని బయటకు వెళ్ళాడు.

అయితే బండిలో పెట్రోల్ అయిపోవడంతో నడిపిస్తూ వస్తుండగా దారిలో హైందవి స్కూటీపై వస్తూ నవీన్‌ను చూసింది. స్కూటీపై తనను ఇంటి వద్ద దింపి పెట్రోల్ తెచ్చుకోమ్మని చెప్పింది.

పెట్రోలో తీసుకొని బండిలో పోసుకొన్న నవీన్ స్కూటీ తాళాలు తిరిగిచ్చే నెపంతో హైందవి ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న నవీన్ ఇంట్లో మరెవరూ లేరనే విషయాన్ని తెలుసుకొని ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.

హైందవి సహకరించకుండా తీవ్రంగా ప్రతిఘటించింది. బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి కత్తితో గొంతుకోసి పారిపోయాడు. పోలీసులను తప్పుదారిపట్టించేందుకు ఆమె బంగారం, చైన్, చెవి దిద్దులు ,మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్ళాడు.

అయితే సీసీటీవి కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. తొలుత హైందవితో కలిసి స్కూటీపై వెళ్ళిన నిందితుడు, ఆ తర్వాత నిందితుడు ఒక్కడే స్కూటీపై తిరిగి వెళ్ళడం సీసీటివి కెమెరాల్లో రికార్డు అయింది.

ఈ దృశ్యాల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు. హైందవి హత్య గురించి అడిగితే తొలుత బుకాయించిన నవీన్ చివరికి అసలు విషయాన్ని చెప్పాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+