కొమ్మినేని విడుదలకు అడ్డంకిగా, జైలులోనే- ఏం జరుగుతోంది..!?

సాక్షి యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విడుదల లో మాత్రం ఆలస్యం అవుతోంది. ఇప్పటికీ కొమ్మినేని జైలులోనే ఉన్నారు. ట్రయల్‌ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిల్‌ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ విధి విధానాలు పూర్తి చేసేందుకు వరుస సెలవులు అడ్డంకిగా మారాయి. దీంతో సోమవారం వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుందని కొమ్మినేని తరపు న్యాయవాదులు చెబుతున్నారు. కొమ్మినేని పై సుప్రీం ఆదేశాల తరువాత రాజకీయంగా చర్చ జరుగుతోంది.

కొమ్మినేని విడుదల వేళ
సాక్షి ఛానల్ కొమ్మినేని శ్రీనివాస రావు చర్చలో జర్నలిస్టు కృష్ణంరాజు రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కీలక సూచనలు చేసింది. కాగా, కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్‌పై బయటకు వచ్చేందుకు వరుస సెలవులు అడ్డంకిగా మారాయి. దీంతో సోమవారం వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుందని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ నెల 6న సాక్షి చానల్‌ డిబేట్‌లో రాజధాని ప్రాంత మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎనలిస్టు కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా, ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ప్రోత్సహించినట్లుగా మాట్లాడిన కొమ్మినేనిని ఏ2గా, సాక్షి యాజమాన్యాన్ని ఏ3గా పేర్కొంటూ తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Delay in Kommineni Srinivasa rao release from Jail details here

సుప్రీం బెయిల్
ఈ కేసులో నిందితుడైన కొమ్మినేనిని ఈ నెల 9న పోలీసులు అరెస్టు చేసి 10న మంగళగిరి కోర్టులో హాజరు పరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. కొమ్మినేని ని గుంటూరు జైలుకు తరలించారు. కొమ్మినేని తొలుత హైకోర్టులో బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసారు. ఆ సమయం లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. బెయిల్ మంజూరు చేస్తూనే.. ట్రయల్‌ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిల్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. కాగా, సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం వరకు రాకపోవడంతో కొమ్మినేని విడుదల జాప్య మైంది. తరువాతి రోజున శనివారం సెలవు అయినా.. మెజిస్ట్రేట్ ను ఇంటి వద్ద కలిసి కొమ్మినేని న్యాయవాదులు విడుదల ఆదేశాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయినా, సాధ్య పడలేదు.

రేపు విడుదల
దీంతో, సోమవారం న్యాయవాదులు ట్రయల్‌ కోర్టులో కొమ్మినేని బెయిల్‌ ఉత్తర్వులు పొందను న్నారు. దీంతో సోమవారం సాయంత్రం కొమ్మినేని బయటకు వచ్చే అవకాశం ఉండదని ఆయన తరపున న్యాయవాదులు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన(ఏ1) కృష్ణంరాజు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కొమ్మినేనికి వైసీపీకి చెందిన లీగల్‌ సెల్‌ న్యాయవాదులు బెయిల్‌ కోసం ప్రయత్నం చేసారు. కాగా, కృష్ణంరాజు మాత్రం సొంతంగా న్యాయవాదిని పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ వివాదంలో మహిళల నిరసనల పై వైసీపీ నేత సజ్జల చేసిన వ్యాఖ్యల పైన అమరావతిలో నిరసనలు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+