పంచ్ ప్రభాకర్ కు ఢిల్లీ పోలీస్ పంచ్-ఉపరాష్ట్రపతి, స్పీకర్ పై యూట్యూబ్ పోస్టులతో-రఘురామ ఫిర్యాదు
ఏపీలో టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ యూట్యూబర్, వైసీపీ ఎన్నారై విభాగం సభ్యుడు పంచ్ ప్రభాకర్ కు ఢిల్లీ పోలీసులు గట్టి ఝలక్ ఇచ్చారు. తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు పలువురిపై పోస్టులు పెట్టిన పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు. దీంతో విదేశాల్లో కూర్చుని అందరికీ పంచ్ లు ఇచ్చే పంచ్ ప్రభాకర్ కు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన రివర్స్ పంచ్ చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో విదేశాల నుంచి ఆయన్ను ఢిల్లీకి పిలిపించబోతున్నారు.

యూట్యూబ్ పంచ్ ప్రభాకర్
యూట్యూబ్ లో వైసీపీకి అనుకూలంగా, టీడీపీ, ఇతర పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వైసీపీ ఎన్నారై విభాగం సభ్యుడు వంచ్ ప్రభాకర్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన పెట్టే పోస్టులకు టీడీపీ నేతలు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. దీంతో వైసీపీ వర్సెస్ టీడీపీ సోషల్ మీడియా వార్ లో పంచ్ ప్రభాకర్ పేరు మార్మోగుతూనే ఉంటుంది. ముఖ్యంగా వైసీపీనీ, సీఎం జగన్ నూ సమర్ధిస్తూ ఆయన పెట్టే పోస్టులకు వైసీపీ వీరాభిమానులు ఫిదా అవుతుంటారు.

టీడీపీ, రఘురామరాజుకు కంట్లో నలుసు
ఇప్పటికే టీడీపీ నేతలతో పాటు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపైనా పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ వీడియో పోస్టులు పెడుతూనే ఉన్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. దీంతో పంచ్ ప్రభాకర్ ను టీడీపీ, రఘురామరాజు టార్గెట్ చేశారు. టీడీపీని, రఘురామరాజును టార్గెట్ చేసే క్రమంలో ఆయన పెట్టిన పలు పోస్టులు వివాదాస్పదం అయ్యాయి కూడా. అయినా పంచ్ ప్రభాకర్ మాత్రం తన పంచ్ లు కొనసాగిస్తూనే ఉన్నారు. వీటికి వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి మంచి ఆదరణ ఉండటంతో ప్రభాకర్ కూడా రెచ్చిపోతున్నారు.

ఢిల్లీ పోలీసులకు రఘురామ ఫిర్యాదు
పంచ్ ప్రభాకర్ తనపై పెడుతున్న పోస్టులపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపైనా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపైనా పంచ్ ప్రభాకర్ అనుచిత పోస్టులు పెట్టినట్లు ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు తగిన వీడియో ఆధారాలను కూడా సమర్పించారు. దీంతో ఢిల్లీ పోలీసులు దీనిపై దృష్టిసారించారు. ఎంపీ చేసిన ఫిర్యాదు కావడం, ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ సహా పలువురు ప్రముఖులపై చేసిన అనుచిత పోస్టుులు కావడంతో ఢిల్లీ పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

పంచ్ ప్రభాకర్ కు నోటీసులు,
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదుపై స్పందించిన డిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పంచ్ ప్రభాకర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. స్ధానిక కోర్టు అనుమతితో సెక్షన్ 504, 506 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో పంచ్ ప్రభాకర్ తో పాటు యూట్యూబ్ కు కూడా నోటీసుు పంపిటన్లు తెలుస్తోంది. పంచ్ ప్రభాకర్ పెట్టిన వీడియోల వివరాలు కోరుతూ యూట్యూబ్ సంస్ధకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. యూట్యూబ్ నుంచి అడిగిన వీడియోల వివరాలు రాగానే వాటి తీవ్రత ఆధారంగా మరిన్ని కేసుల నమోదుకు రంగం సిద్ధమవుతోంది.

వైసీపీ సెల్ఫ్ గోల్ ?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారు, బహిరంగ వ్యాఖ్యలు చేసిన వారిపై ఏపీ పోలీసులు, సీఐఢీ అధికారులు ఐటీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రద్దయిన ఐటీ సెక్షన్ 66ఏ కింద కూడా కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ సర్కార్ వ్యతిరేక వ్యాఖ్యల్ని జగన్ సర్కార్ సీరియస్ గా తీసుకుని కేసులు పెడుతోంది. అదే సమయంలో వైసీపీ ఎన్నారై విభాగం సభ్యుడైన పంచ్ ప్రభాకర్ ఏకంగా ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ పై తన యూట్యూబ్ ఛానల్లో అనుచిత వ్యాఖ్యల కేసులో కేసుల పాలవ్వడం వైసీపీకి మింగుడు పడటం లేదు. ఈ కేసుల్ని ఢిల్లీ పోలీసులు సీరియస్ గా తీసుకుంటే మాత్రం పంచ్ ప్రభాకర్ కు కష్టాలు తప్పవు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications