TTD: టీటీడీలో డిప్యూటేషన్లు, వలస పాలనకు చెక్, చంద్రబాబు, పవన్ కల్యాణ్
టీటీడీలో చిన్న ఉద్యోగం వచ్చినా జీవితం ధన్యం అవుతుందని చాలా మంది బావిస్తుంటారు. తిరుమల శ్రీనివాసుడికి సేవ చేసే భాగ్యం కలగాలంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలని చాలాం మంది అనుకుంటారు. టీటీడీలో ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు పడుతాయా ?, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందా ? అంటూ నిరుద్యోగులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు.
అయితే ఇప్పుడు టీటీడీలోకి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారుల్ని వాళ్ళ మాతృ సంస్థల్లోకి పంపించడానికి ఆంధ్రప్రదేవ్ లోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. గత వైసీపీ ప్రభుత్వంలో ఇతర శాఖలకు చెందిన చాలా మంది అధికారులు డిప్యూటేషన్ పై టీటీడీలోకి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఆ అధికారులు ఇంకా టీటీడీలోనే పనిచేస్తున్నారు.

గతంలో వైసీపీ నాయకులకి పూర్తిగా సహకరించారని కొందరు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు ఇంకా టీటీడీలోనే పనిచేస్తుండటంతో వారికి వెంటనే స్థాన చలనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని తెలిసింది. నాలుగేళ్ల క్రితం డిప్యూటేషన్ పైన టీటీడీలో అడుగుపెట్టిన అధికారుల జాబితాను కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తుందని తెలిసింది.
టీటీడీలో డిప్యూటేషన్ సంస్కృతికి చెక్ పెట్టాలని టీటీడీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు టీటీడీ ఈవో శ్యామలరావు కి మనవి చేశారని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలోకి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులకు స్థానచలనం కల్పించాలని టీటీడీ ఉద్యోగులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. అప్పటి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి టీటీడీ విద్యాశాఖ అధికారిగా భాస్కర్ రెడ్డిని నియమించడం తెలిసిందే.
పుత్తూరు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డిని నియమాలకు విరుద్ధంగా టీటీడీ విద్యాశాఖ అధికారిగా నియమించడం అప్పట్లో వివాదాలకు కారణమైంది. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆ ఆరోపణలు ఏమాత్రం పట్టించుకోకుండా భాస్కర్ రెడ్డి ని ఆ పదవిలో కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు నెలల క్రితం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించారు. వైయస్సార్ కడప జిల్లాలోని కోడూరు డిగ్రీ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న నాగరాజు నాయుడుని టీటీడీ విద్యాశాఖ అధికారిగా నియమించడం టీటీడీలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు మింగుడుపడడం లేదు.

గత వైసీపీ ప్రభుత్వం కొనసాగించిన డిప్యూటేషన్ సంస్కృతిని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించడంతో కొందరు టీటీడీ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. టీటీడీలోని కీలకమైన పదవుల్లో డిప్యూటేషన్ పైన వచ్చిన ఉద్యోగులే ఉండటం టీటీడీలో పనిచేస్తున్న కొందరు అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీటీడీలో డిప్యూటేషన్ సంస్కృతికి చెక్ పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వానికి మనవి చేయాలని కొందరు టీటీడీ ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్ పైన టీటీడీలోకి వచ్చిన కొంతమంది ఉద్యోగులు ఇంకా అక్కడే కొనసాగుతున్నారని, వారిని వాళ్ల మాతృ సంస్థలకు పంపించాలని కొందరు టీటీడీ ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి మనవి చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. మొత్తం మీద టీటీడీలో డిప్యూటేషన్ సంస్కృతి ఇలాగే కొనసాగితే అసలైన టీటీడీ ఉద్యోగులకి అన్యాయం జరిగే అవకాశం ఉందని తెలిసింది.












Click it and Unblock the Notifications