ఐఎఫ్‌ఆర్: ఆర్కేబీచ్‌లో దుకాణాల తొలగింపు (ఫోటోలు)
విశాఖపట్నం: విశాఖలో ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్) జరగనున్న నేపథ్యంలో నగరంలో సుందరీకరణ పనులను చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్కేబీచ్‌లోని బస్‌స్టాప్‌ను ఆనుకుని ఉన్న చిల్లర దుకాణాలను బుధవారం గ్రేటర్ విశాఖ (జీవీఎంసీ) తొలగించింది.
జీవీఎంసీ లీజుకు ఇచ్చిన ఈ స్థలంలో కొందరు కూల్ డ్రింక్స్, చిరుతిళ్ల దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇచ్చిన స్థలంలో అనధికారికంగా నిర్మించి వ్యాపారం చేస్తున్నారని జీవీఎంసీ అధికారులు తెలిపారు. బుధవారంతో లీజు పూర్తి కావడంతో పొక్లెయిన్లతో దుకాణాలను తొలగించారు.
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్) నేపథ్యంలో ఇక్కడి నుంచి యుద్ధప్రాతిపదికన శిథిలాలను తొలగించి, సుందరీకరణ పనులు చేపట్టారు. మరోవైపు ఐఎఫ్‌ఆర్ రిహార్సల్స్ బుధవారం నగరంలోని ఆర్‌కె బీచ్‌లో ప్రారంభమయ్యాయి. భారత నౌకాదళం సగర్వంగా చెప్పుకునే ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ధనౌకలు చాలా కాలం తర్వాత విశాఖ తీరంలో కనిపించాయి.

ఆర్కేబీచ్‌లో దుకాణాల తొలగింపు
విశాఖలో ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్) జరగనున్న నేపథ్యంలో నగరంలో సుందరీకరణ పనులను చేపట్టారు.

ఆర్కేబీచ్‌లో దుకాణాల తొలగింపు
ఇందులో భాగంగా ఆర్కేబీచ్‌లోని బస్‌స్టాప్‌ను ఆనుకుని ఉన్న చిల్లర దుకాణాలను బుధవారం గ్రేటర్ విశాఖ (జీవీఎంసీ) తొలగించింది.

ఆర్కేబీచ్‌లో దుకాణాల తొలగింపు
జీవీఎంసీ లీజుకు ఇచ్చిన ఈ స్థలంలో కొందరు కూల్ డ్రింక్స్, చిరుతిళ్ల దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు.

ఆర్కేబీచ్‌లో దుకాణాల తొలగింపు
ఇచ్చిన స్థలంలో అనధికారికంగా నిర్మించి వ్యాపారం చేస్తున్నారని జీవీఎంసీ అధికారులు తెలిపారు. బుధవారంతో లీజు పూర్తి కావడంతో పొక్లెయిన్లతో దుకాణాలను తొలగించారు.

ఆర్కేబీచ్‌లో దుకాణాల తొలగింపు
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్) నేపథ్యంలో ఇక్కడి నుంచి యుద్ధప్రాతిపదికన శిథిలాలను తొలగించి, సుందరీకరణ పనులు చేపట్టారు. మరోవైపు ఐఎఫ్‌ఆర్ రిహార్సల్స్ బుధవారం నగరంలోని ఆర్‌కె బీచ్‌లో ప్రారంభమయ్యాయి.

ఆర్కేబీచ్‌లో దుకాణాల తొలగింపు
భారత నౌకాదళం సగర్వంగా చెప్పుకునే ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ధనౌకలు చాలా కాలం తర్వాత విశాఖ తీరంలో కనిపించాయి.












Click it and Unblock the Notifications