వెంకటేశ్వర స్వామికీ నోట్ల రద్దు కష్టాలు: పాత కరెన్సీకి బ్యాంకులు నో, ఒక్కసారికే ఛాన్స్
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం కోటీశ్వరుల నుంచి సామాన్యుల వరకు అందరి పైన పడింది. చివరకు దేవుడి పైన కూడా ఈ నోట్ల రద్దు ప్రభావం పడింది.
చిత్తూరు: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు ప్రభావం కోటీశ్వరుల నుంచి సామాన్యుల వరకు అందరి పైన పడింది. చివరకు దేవుడి పైన కూడా ఈ నోట్ల రద్దు ప్రభావం పడింది. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నోట్ల రద్దు చిక్కులు వచ్చి పడ్డాయి.
మంగళవారం నాడు శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన కానుకల్లో రూ.90 లక్షలు పాత రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయి. బ్యాంకులు ఈ నోట్లను స్వీకరించేందుకు ముందుకు రాలేదు. ఈ నెల 30వ తేదీ లోపు ఒకేసారి జమ చేసుకోవాలని షరతు పెట్టాయి. రూ.5వేలకు పైగా ఉన్న మొత్తాన్ని ఈ నెల 30వ తేదీ లోపు ఒకేసారి జమ చేయాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.

దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) తన వద్దనే రద్దయిన పాత నోట్లను పెట్టుకుంది. వాటిని ఓ పెట్టెలో పెట్టారు. శ్రీవారికి మంగళవారం రూ.2.47కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. నిత్యం వచ్చే హుండీ కానుకలను స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులో టిటిడి జమ చేస్తుంది.
ఈ మేరకు నోట్లను బ్యాంకులో వేసే సమయంలో రద్దయిన నోట్లను నిరాకరించి మిగిలిన నోట్లను బ్యాంకులు స్వీకరించాయి. కాగా, నిబంధనలు సడలించాలని కోరుతూ ఆర్బీఐకి లేఖ రాయాలని టిటిడి నిర్ణయించింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications