బంగాళాఖాతంలో వాయుగుండం: కోస్తాలో వర్షసూచన

బుధవారం రాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పలు చోట్ల వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. విశాఖ, కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
వాయుగుండం తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి తూర్పు ఈశాన్య దిశలో 600 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయదిశలో 500 కీలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి అల్పపీడనంగా మారిందని చెబుతున్నారు. ఈ నెల 21వ తేదీన అది తీరం దాటే అవకాశాలున్నాయని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications