వాయుగుండం దూకుడు.. తీరానికి ఎంత దూరంలో ఉందో చూడండి

బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ముందుకు కదులుతోంది. గడచిన కొన్ని గంటలుగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు పయనిస్తున్న ఈ వాయుగుండం, ప్రస్తుతం సముద్రంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది రానున్న గంటల్లో మరింత బలపడి భీకర రూపం దాల్చే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది.

ప్రస్తుతం ఈ వాయుగుండం శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పున 630 కిలోమీటర్ల దూరంలో, అండమాన్ నికోబార్ దీవులలోని విజయపురానికి పశ్చిమ-నైరుతి దిశలో 690 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 840 కిమీ, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 1010 కిమీ , ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 1130 కిలోమీటర్ల దూరంలో స్థిరపడిందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

Depression Over Bay of Bengal Intensifies and Is Expected to Turn Into a Severe Cyclonic Storm Soon
 ముంచుకొస్తున్న ఆక్వాన్ తుఫాను, ఆర్నాబ్ ను మించి- ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం..!!
ముంచుకొస్తున్న ఆక్వాన్ తుఫాను, ఆర్నాబ్ ను మించి- ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం..!!

తుఫానుగా రూపాంతరం.. ఆపై తీవ్ర తుఫానుగా మారే హెచ్చరిక

ఈ వాయుగుండం రానున్న గంటల్లో మరింత బలపడి ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించనుంది. రేపు (నవంబర్ 16న) దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలు, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఇది తుఫానుగా బలపడనుంది. ఆ తర్వాత నవంబర్ 17 నాటికి ఇది మరింత తీవ్రరూపం దాల్చి 'తీవ్ర తుఫాను'గా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

మూడు రాష్ట్రాలకు దడ పుట్టిస్తున్న తుఫాను!.. నవంబర్ 16న ఉప్పెనే!
మూడు రాష్ట్రాలకు దడ పుట్టిస్తున్న తుఫాను!.. నవంబర్ 16న ఉప్పెనే!

ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనం.. యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుఫానుగా మారిన తర్వాత ఇది మరింత బలపడి, తదుపరి రెండు రోజుల్లో నేరుగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సముద్రం అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+