పవన్ ఆన్ డ్యూటీ: ఇక నేరుగా, స్థానికం వేళ బిగ్ డెసిషన్..!!

స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ఈ రోజు సుప్రీం లో బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం వెలువడిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కూటమి- వైసీపీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. కూటమిలో సీట్ల ఖరారు పైన సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలను పవన్ సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ విధానం పైన ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. కాగా.. షెడ్యూల్ విడుదలకు రంగం సిద్దం అవుతున్న వేళ పవన్ తాజాగా తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.

స్థానిక ఎన్నికలను డిప్యూటీ సీఎం పవన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేయటంతో పాటుగా పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వటానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. స్థానికంలో పోటీ.. పొత్తుల లెక్కల పైన సొంత నేతలకు పవన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. కాగా.. సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో పార్టీ కోరుకుంటున్న మేయర్, మున్సిపల్ ఛైర్మన్ స్థానాల జాబితా అందించినట్లు తెలుస్తోంది. కూటమిలో చర్చించిన తరువాత పార్టీకి ఇచ్చే స్థానాల పైన మరోసారి సీఎం, డిప్యూటీ సీఎం చర్చించనున్నారు. కాగా.. పవన్ ఈ ఎన్నికల కోసం పార్టీ గతంలో ఏర్పాటు చేసిన కమిటీలను రద్దు చేసారు. ఇప్పుడు స్వయంగా తానే రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ మినహా మిగిలిన 24 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ప్రత్యేక అడ్‌హాక్ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించారు.

కూటమిలో మేయర్ సీట్లు ఎవరికి ఎక్కడ - లిస్టులో..!!
కూటమిలో మేయర్ సీట్లు ఎవరికి ఎక్కడ - లిస్టులో..!!
deputy-cm-pawan-kalyan-decided-to-appoint-new-committees-for-local-body-elections-here-the-details

పవన్ తాజా నిర్ణయాలతో

పవన్ స్వయంగా తన పర్యవేక్షణలో ఈ తాజా కసరత్తు, రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన అనుసరించబోయే వ్యూహాత్మక మార్పుల పైన స్పష్టత ఇస్తోంది. నియోజకవర్గాల వారీగా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి.. పార్టీ బలం గురించి పవన్ అంచనాకు వస్తున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, బలమైన అభ్యర్థులు.. వంటి సమగ్ర వివరాలను ఈ బృందాలు సేకరించి రాష్ట్ర సమన్వయ కమిటీకి నివేదిస్తాయి. అధిష్ఠానం వద్ద పక్కా డేటా ఉండటం ద్వారా టికెట్ల కేటాయింపులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సమర్థులైన వారికే అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణే నేరుగా బాధ్యతలు చేపట్టి, ప్రతీ నిర్ణయాన్ని స్వయంగా సమీక్షిస్తుండటంతో ఎవరికి సీటు ఇచ్చినా.. మిగిలిన నేతలు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదే సమయంలో కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూనే.. తమ బలం పెంచుకోవటం పైన పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సమన్వయ కమిటీ సమావేశంలో మూడు పార్టీల కు దక్కే సీట్ల పైన ఒక నిర్ణయానికి రానున్నారు. ఆ తరువాత చంద్రబాబు - పవన్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక.. ఇప్పుడు నియమించే కమిటీలు.. భవిష్యత్ కార్యాచరణ పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+