పవన్.. తెర వెనుక అసలు గేమ్ ఛేంజర్

Game Changer: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన మచ్ అవైటెడ్ మూవీ.. గేమ్ ఛేంజర్. ఎస్ శంకర్ దర్శకుడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ బిగ్ బడ్జెట్ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ మొత్తం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు.

Deputy CM Pawan Kalyan set to be the Chief Guest for Game Changer event

ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ డిఫరెంట్ లుక్స్‌తో కనిపించాడు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఓ ఫుల్ ప్లెడ్జ్డ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో మెగా పవర్ స్టార్ కనిపించడం వల్ల మంచి బజ్ క్రియేట్ అయింది. టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లో బిజీ అయ్యారు స్టార్ క్యాస్ట్ అంతా. హైదరాబాద్‌లో ఈ నెల 2వ తేదీన ట్రైలర్ లాంచ్‌తో దీనికి శ్రీకారం చుట్టారు. ఈ సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగనుంది. దీని తరువాత చెన్నై, ముంబైల్లో ప్రమోషన్ ఈవెంట్స్ షెడ్యూల్ అయ్యాయి.

రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరు కాబోతోన్నారు. దీనికి ఆయనే చీఫ్ గెస్ట్. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. మెగా బ్రదర్స్ హాజరు కాబోతోన్న నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీన్ని విజయవంతం చేయడానికి సన్నద్ధం అయ్యారు.

ఈ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఏం చెప్పబోతోన్నారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతరం అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఏపీలో ఓ బిగ్గెస్ట్ సినిమా కార్యక్రమం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి.

పైగా- దీనికి పవన్ కల్యాణ్ హాజరు కాబోతోండటం అందరి దృష్టీని ఆకర్షించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లబ్ది కలిగించేలా పవన్ కల్యాణ్ ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. టాలీవుడ్‌ను ఏపీకి ఆహ్వానిస్తారని అంటున్నారు. దీనికి అవసరమైన కొన్ని రాయితీలను కూడా ఈ సందర్భంగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ స్వయంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే కావడం, కష్టనష్టాల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం వల్ల ఇండస్ట్రీకి మేలు కలిగేలా ప్రకటనలు చేస్తారని చెబుతున్నారు. అదే సమయంలో- గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ల రేట్ల నిర్ధారణ, బెనిఫిట్/ప్రీమియర్ షోల ప్రదర్శనకు అనుమతులు ఇవ్వడంపైనా స్పష్టత ఇవ్వొచ్చని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+