తిరుమలలో మేలో జరిగే ఉత్సవాల వివరాలు.. మే 16నుంచి పద్మావతి పరిణయోత్సవాలు..
శ్రీవారి భక్తులకు గమనిక.. తిరుమలలో మే నెలలో వచ్చే విశేష ఉత్సవాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. మే నెలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి. శ్రీ గోవింద రాజుస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించనున్నారు. వాటి వివరాలను టీటీడి విడుదల చేసింది. మే నెలకు సంబంధించిన విశేష ఉత్సవాలను జాబితాను ప్రకటించింది. వచ్చే నెల 10వ తేదీన అక్షయ తృతీయ ఉంటుందని వివరించింది. మే 16 నుంచి 24 వరకు శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుగుతాయని తెలిపింది.
వీటితో పాటు అనేక ఉత్సవాలు జాబితాను కూడా టీటీడి వెల్లడించింది. వచ్చే నెల 3వ తేదిన శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం జరగనుంది. వచ్చే నెల 4 వతేదిన సర్వ ఏకాదశి. మే 12వ తేదీన శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి నిర్వహిస్తారు. మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. మే 22న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి ఉంటుంది. మే 23న శ్రీ అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేది నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక, ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

వాహనసేవల వివరాలిలా ఉన్నాయి..
వచ్చే నెల 16న ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. అదేరోజు రాత్రి పెద్దశేష వాహనం జరుగుతుంది. వచ్చేనెల 17న ఉదయం చిన్నశేష వాహనం నిర్వహిస్తారు. రాత్రి హంస వాహన సేవ కార్యక్రమం ఉంటుంది. మే 18న ఉదయం సింహ వాహనం జరుగుతంది. అదే రోజు రాత్రి ముత్యపుపందిరి వాహనం. మే 19న ఉదయం కల్పవృక్ష వాహన కార్యక్రమం ఉంటుంది. అదే రోజు రాత్రి సర్వభూపాల వాహనం జరుగుతుంది. మే 20న ఉదయం మోహినీ అవతారం.. రాత్రి గరుడ వాహనం. మే 21న ఉదయం హనుమంత వాహనం నిర్వహిస్తారు. రాత్రి గజ వాహనం. మే 22న ఉదయం సూర్యప్రభ వాహనం జరుగుతుంది. రాత్రి చంద్రప్రభ వాహనం. మే 23న ఉదయం రథోత్సవం.. రాత్రి అశ్వవాహనం. మే 24న ఉదయం చక్రస్నానం జరగగా, అదే రోజు రాత్రి ధ్వజావరోహణం నిర్వహిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications