స్త్రీని అంగడి సరుకా, వర్మను వదిలేది లేదు: దేవి, నన్నపనేనిపైనా ఫైర్
విశాఖపట్నం: రామ్ గోపాల్ వర్మపై ఎఫ్ఐఆర్‌లు, అరెస్టులతో తమ పోరాటం ఆగదని సామాజిక కార్యకర్త దేవి అన్నారు తనపై చేసిన వ్యాఖ్యలకు రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్తే సరిపోదని అన్నారు.
స్త్రీ శరీరాన్ని సరుకుగా భావించి వర్మ మార్కెట్ చేయాలనుకుంటున్నారని అన్నారు. విశాఖపట్నంలో రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన 48 గంటల ధర్నాకు ఆమె మద్దతు తెలిపారు.

పోరాటం మాకు కత్త కాదు
పోర్న్ ప్రమోషన్ వల్ల మహిళల హక్కులకు భంగం కలుగుతుందని దేవి అన్నారు. మహిళల ప్రయోజనాలు దెబ్బ తిన్నాయని అన్నారు. పోరాటాలు తమకు కొత్త కాదని అన్నారు. ఏది చేయాలో అది చేస్తామని హెచ్చరించారు.

అంగాంగ ప్రదర్శన చేస్తామంటే...
స్త్రీలను అంగడి వస్తువులుగా చేసి అంగాంగ ప్రదర్సన చేస్తామంటే తాము అంగీకరించబోమని దేవి అన్నారు. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సాక్షిగా తమ పోరాటం ఉధృమవుతుందని అన్నారు.

ఇది వర్మపై పోరాటం కాదు..
ఇదేదో వర్మపై పోరాటం కాదని దేవి అన్నారు. పోర్న్, సినిమా, యాడ్స్ ...ఇలా స్త్రీ శరీరాన్ని సరుకుగా చేసుకునే ప్రతి వేదిక మీద కూడ ఈ పోరాటం సాగుతుందని అన్నారు. స్త్రీల శరీరాన్ని అమ్ముకోవడానికి వాళ్లెవరని ప్రశ్నించారు.

నన్నపనేనిపై ఆగ్రహం
మహిళల హక్కుల రక్షణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పందని సరిగా లేదని దేవి విమర్శించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యవహరించిన తీరుపై దేవి మండిపడ్డారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications