'పురంధేశ్వరివి సీమాంధ్ర సిఎం కలలు': గవర్నర్‌తో జగన్

purandeswari and devineni
విజయవాడ/హైదరాబాద్: విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి కావాలని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కలలు కంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం ఆరోపించారు. ఆమె సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన మాట్లాడారు.

దగ్గుబాటి దంపతులు చెబితే వినే పరిస్థితుల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు లేరన్నారు. విభజన జరిగి, సీమాంధ్ర ప్రాంతానికి సిఎం కావాలని పురంధేశ్వరి కలలు కుంటున్నారని విమర్శించారు. నీ పదవి కోసం సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు ఉద్యోగం వదులుకోవాలా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఇచ్చిన బ్లూ ఫ్రింటును పురంధేశ్వరి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ డ్రామాలు ఆపాలన్నారు. కేంద్రమంత్రులు, ఎంపీల అసమర్థత వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు.

సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటీ

రాష్ట్ర రాజదాని హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్సులో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీకి పదిమంది మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

గవర్నర్‌ను కలిసిన జగన్ పార్టీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం గవర్నర్‌ను కలిశారు. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చి తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జగన్ ఈ సందర్భంగా కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+