ఢిల్లీ నుండి కోట్లు, డిగ్గీ 10కోట్ల ఆఫర్: దేవినేని సంచలనం

ఢిల్లీ నుండి బిఎస్ఎఫ్ ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు కోట్లాది రూపాయలు వచ్చాయన్నారు. వీటితో డిగ్గీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10కోట్లు ఆఫర్ చేస్తున్నారని, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు
మరోవైపు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చకు టిడిపి, తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే చర్చ జరపాలంటూ బిజెపి, నాగం, తెరాస, సిపిఐలు, తుఫాను నష్టం బాధితులకు పరిహారంపై సిపిఎం, సమైక్య తీర్మానం కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.
సమావేశాల ప్రారంభానికి ముందు తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... తెలంగాణపై బిల్లుపై చర్చను రెండు రోజుల్లో ముగించి పార్లమెంటుకు పంపాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు పదవుల కోసం మౌనం వహిస్తున్నారని, సోనియా గాంధీ హిట్లర్‌ను మరిపిస్తున్నారని టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. విమానంలో టి బిల్లుతో పాటు డబ్బులు కూడా వచ్చాయని దూళిపాళ్ల అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి సమైక్యంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications