హరీష్‌రావుతో మాట్లాడాను, మేం నిలిపేశాం: దేవినేని
హైదరాబాద్: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో తాను మాట్లాడానని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం తెలిపారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
శ్రీశైలంలో నీటిమట్టం 860 అడుగులకు పడిపోయిందన్నారు. నీటి పారుదల శాఖ కార్యదర్శులు చర్చలు జరుపుతున్నారని దేవినేని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైపు నుండి శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేసినట్లు తెలిపారు. రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

ఎన్టీఆర్ మోడల్ స్కూల్ విరాళం రూ.5 లక్షలు
హుధుద్ తుఫాను బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ మోడల్ పాఠశాల రూ.5 లక్షల విరాలం ప్రకటించింది. మోడల్ స్కూల్ డైరెక్టర్ ఎన్వీ ప్రసాద్ ఈ విషయాన్ని తెలిపారు.
బాబును కలిసిన కర్నూలు జిల్లా నేతలు
కర్నూలు జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడును కలిశారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ అంశంపై వారు చర్చించారు. గత ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి ఎన్నికలకు ముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
విజయవాడ కేంద్రంగా మంగళవారం నుండి రైతు సాధికార సంస్థ పని చేయడం ప్రారంభిస్తుందని, ఈ కార్యాలయాన్ని రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని మంత్రి పత్తిపాటి పుల్లారావు విజయవాడలో తెలిపారు. రైతు సాధికార సంస్థ సీఈవోగా వ్యవసాయ కమిషనర్ వ్యవహరిస్తారని, సంస్థలో ఆరుగురు డైరెక్టర్లు ఉంటారని తెలిపారు. రైతు సాధికార సంస్థ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
నకిలీనోట్లు చలామణి చేస్తున్న ఇద్దరి అరెస్టు
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లిలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు లక్షల నకిలీనోట్లు, ద్రావకం, రూ.10వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడపలో అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications