'వెల్లడించిన బ్లాక్ మనీలో జగన్‌వే రూ.10వేల కోట్లు, ఆ వివరాలివీ..'
విజయవాడ: దేశంలో వెల్లడించిన బ్లాక్ మనీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిదే ఎక్కువ భాగమని మంత్రి దేవినేని ఉమామహేశ్వ రావు సోమవారం నాడు ఆరోపించారు. హైదరాబాద్ నుంచి ప్రకటించిన మొత్తం నల్లధనంలో రూ.10వేల కోట్లు ఆయనవే అన్నారు.
విజయవాడలో ఆయన మాట్లాడారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని జగన్ బ్లాక్ మనీని తెల్లధనంగా మార్చుకున్నాడన్నారు. జగన్ అవినీతి సంపదతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. జగన్‌కు బినామీల పేరుతో తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఎకరాల గనులు, భూములు ఉన్నాయని చెప్పారు.

ఇడుపులపాయ అండర్ గ్రౌండులో వేల కోట్ల రూపాయలు, సంచుల కొద్ది డబ్బు ఉందన్నారు. బెంగళూరులోని వైట్ హౌస్‌లో లారీల కొద్ది డంప్‌లు పెట్టి కూర్చున్నారన్నారు. ఆ సంపద ఏపీకి తెస్తే రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు.
జగన్‌కు ఉన్న భూముల వివరాలను జిల్లా వారీగా ఆయన ప్రకటించారు. రూ.33,935 కోట్ల విలువైన 94,038 ఎకరాలు భూములు, లక్షా 81వేల ఎకరాల మేర గనులు జగన్ బినామీల పేరుతో ఉన్నాయని వెల్లడించారు.
తమ పార్టీ యువనేత నారా లోకేశ్ పైన సాక్షి చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు హర్షించరన్నారు. నారా లోకేశ్ చదువుతో పాటు సంస్కారం నేర్చుకున్నారన్నారు. పెద్దలను ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసునని చెప్పారు.
తుని విధ్వంసం ఘటనలో వైసిపి పాత్ర త్వరలో వెల్లడవుతుందన్నారు. పులివెందులకు నీళ్లు రావంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే పులివెందులకు నీళ్లిచ్చి అక్కడే సన్మానాలు చేయించుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications