Srisailam: శ్రీశైలంలో చిరుత సంచారం.. ఆందోళనలో భక్తులు..
తిరుమల నడక మార్గంలోనే కాకుండా శ్రీశైలంలో కూడా చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచారంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో చిరుత సంచరిచడంతో ఘాట్ రోడ్ లో వెళ్లే వారు భయపడతున్నారు. శనివారం రాత్రి రత్నానందస్వామి ఆశ్రమం వద్ద ఉన్న హోమగుండం దగ్గర గోడపై చిరుత పులి కూర్చుని ఉండటం భక్తులు గమనించారు. వారిని చూసిన చిరుత చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది.
భక్తులు తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు. చిరుత రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ ఆవును చంపింది. చిరుత పులి సంచారంతో భక్తులతో పాటు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రత్నానంద ఆశ్రమం వద్ద గోడపై కూర్చుని ఉన్న చిరుత పులి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు శ్రీశైలం దేవస్థానానికి భారీగా భక్తులు తరలొస్తున్నారు. శ్రీశైలంలో రోజురోజుకూ చిరుత పులుల సంచారం పెరుగుతూనే ఉండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

శ్రీశైలం అటవీ ప్రాంతం కావడంతో చిరుత పులుల సంచారం పెరుగుతోంది. చిరుత కనిపించినప్పుడల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అయితే తాము ఎన్నిసార్లు కంప్లెయింట్‌లు ఇచ్చినా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో చిరుత వీడియోలు వైరల్ కావడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు.
ఘటనా స్థలానికి చేరుకుని చిరుత సంచారానికి సంబంధించిన వివరాలు సేకరించారు. చిరుత పాదముద్రలను సేకరించి.. ఆవుని చంపి తిన్నది చిరుత పులి అని గుర్తించారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లొద్దని కోరుతున్నారు. చిరుత అడుగుల ఆధారంగా అది ఎటువైపుకు వెళ్లిందనే దానిపై అటవీ శాఖ అధికారులు అంచనాకు వస్తున్నారు.
3 నెలల క్రితం ఔటర్ రింగ్ రోడ్డులోని రుద్రాపార్కు సమీపంలో గోడపై కూర్చుని చిరుతపులి కనిపించిదని స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు చిరుత కనిపించడంపై భయపడుతున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications