ఎప్పుడూ లేనిది.. తిరుమల క్యూలైన్ లో బెల్టుతో కొట్టుకోవడం ఏంట్రా

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 83,112 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,054 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుండి 15 గంటల సమయం పట్టింది.

తిరుమలలో ఎప్పుడూ లేనివిధంగా క్యూలైన్ లో భక్తులు గొడవ పడ్డారు. ఒకరినొకరు పరస్పరం ఘర్షణకు దిగారు. వారిమధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలీవానగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బెల్ట్ తీసి కొట్టుకునేంత స్థాయికి వెళ్లింది. వారిలో ఒకరు బెల్ట్ తీసి కొట్టడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. క్యూలైన్ బయటి నుండి శ్రీవారి సేవకురాలు ఒకరు వారిని వారించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు.

Devotees Clash in Tirumala Queue Line Near Krishna Teja Rest House TTD Urges to Keep Calm Peaceful

ఈ గొడవలో ఆ భక్తుల కుటుంబ సభ్యులు సైతం జోక్యం చేసుకున్నారు. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గొడవ తీవ్రతరమౌతోండటంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, శ్రీవారి సేవకులు వారిని శాంతింపజేశారు. క్యూ లైన్ లో దర్శనం సజావుగా సాగేలా చేశారు.

భక్తులు గొడవ పడిన విషయాన్ని టీటీడీ ధృవీకరించింది. కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్ లో వేచి ఉండే సమయంలో ఇద్దరు భక్తులు పరస్పర ఘర్షణ కు దిగిన సంఘటన సోమవారం నాడు చోటు చేసుకుందని వివరించింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తం కావడంతో ఘర్షణను నిలువరించారని తెలిపింది.

శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు ఈ విధంగా పరస్పర ఘర్షణకు దిగడం సమంజసం కాదని, ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ తోటి భక్తులతో స్నేహ పూర్వకంగా ఉండాలని, అదేవిధంగా క్యూలైన్ నియమాలను తప్పనిసరిగా పాటించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+