బాధ్యత వహిస్తారా చెప్పండి, 26న అనుమతిలేదు: పవన్-జగన్‌లకు డీజీపీ ప్రశ్న
జల్లికట్టు తరహా విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలన్న సోషల్ మీడియా ప్రచారం పైన ఏపీ డీజీపీ సాంబశివ రావు మంగళవారం నాడు స్పందించారు.
విజయవాడ: జల్లికట్టు తరహా విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలన్న సోషల్ మీడియా ప్రచారం పైన ఏపీ డీజీపీ సాంబశివ రావు మంగళవారం నాడు స్పందించారు. అసలు నిరసనలకు ఎవరు బాధ్యత వహిస్తారో ముందుకు రావాలన్నారు.
బాధ్యత ఎవరు వహిస్తారో రండి
సోషల్ మీడియాలో జరిగే ప్రచారానికి ఓనర్ షిప్ ఉండదని చెప్పారు. సోషల్ మీడియాలో సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదని చెప్పారు. ఓనర్ షిప్ లేని ప్రచారానికి అనుమతి ఎలా ఇస్తామన్నారు.
అనుమతి లేదు: అందుకే.. విశాఖలో చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్!
ఇలాంటి నిరసనలకు ఎలా అంగీకరిస్తాం
ఆర్కే బీచ్‌లో జరిగే నిరసనలకు ఎవరు బాధ్యత వహిస్తారో ముందుకు రావాలన్నారు. బాధ్యత వహించా వారు ముందుకు వస్తే చూస్తామన్నారు. అనుమతి, సెక్యూరిటీ, ఏర్పాట్లు లేని నిరసనలకు ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.
పవన్ కావొచ్చు.. ఎవరైనా కావొచ్చు
శాంతియుత నిరసనలు చేస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పవన్ కళ్యాణ్, జగన్ మద్దతివ్వడంపై విలేకరులు ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ కావొచ్చు.. ఎవరైనా కావొచ్చు.. బాధ్యత వహించే వారు తమ వద్దకు రావాలన్నారు.

రెచ్చగొట్టే వాటిపై స్పందించొద్దు
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఎవరూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ప్రచారం చూసి ఎవరూ గుమికూడవద్దన్నారు. తమకు శాంతిభద్రతలు తొలి ప్రాధాన్యం అన్నారు. అసాంఘిక శక్తులు చొరబడే అవకాశముందన్నారు.
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించం
తాము ఎవరి భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించమని చెప్పారు. నిరసనలకు అనుమతి లేదన్నారు. పవనో మరొకరో అనేది ప్రశ్న కాదన్నారు. 26న ఆర్కే బీచులో మాత్రం నిరసనలకు అనుమతి లేదన్నారు. ఇంత తక్కువ సమయంలో తాము ఏర్పాట్లు చేసుకోలేమని చెప్పారు.
'తమ్ముడు' ట్రావెలింగ్ సోల్జర్, పాచిపోయిన లడ్డూ: ఆల్బమ్‌తో 'ప్రత్యేక' నిరసన (ఆడియో)
చెన్నై మొదట బాగానే ఉంది
కొందరు జల్లికట్టుకు హోదాకు లింక్ పెట్టడంపై డిజిపి సాంబశివ రావు స్పందించారు. చెన్నై మొదట బాగానే ఉందని, ఆ తర్వాత హింసాత్మకంగా మారిందని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదన్నారు.
సుప్రీం గైడ్ లైన్స్‌ను తాము ఫాలో అవుతున్నామని చెప్పారు. ఆర్కే బీచులో నిరసనలు, సమూహాలు ఎలాంటి వాటికైనా దారి తీయవచ్చునని చెప్పారు. నిరసనలు తెలిపే అంశాల్లో బాధ్యత ఎవరిదో చెప్పాలన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications