దోచుకున్నోళ్లంతా జగన్ వైపు, త్వరలో ధర్మాన: సోమిరెడ్డి

బాలశౌరి, వైయస్ జగన్ లాంటి వారు అనూహ్యంగా వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు కుటుంబం కూడా త్వరలో జగన్ పంచన చేరబోతుందన్నారు. ధర్మాన త్వరలో జగన్ పార్టీలో చేరుతారని చెప్పారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆస్తి 2004లో తొమ్మిది కోట్లకు పైగా ఉంటే ఇప్పుడు 122 కోట్లకు ఎలా పెరిగిందన్నారు. అలాగే జగన్ ఆస్తి 2004కు ఇప్పటికి ఇరవై వేల రెట్లు పెరిగిందన్నారు. అవినీతిపరులంతా ఒక కూటమిగా ఏర్పడబోతున్నారని మండిపడ్డారు.
రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెసు పార్టీ విభజన ప్రక్రియ సాగిస్తోందని మండిపడ్డారు. తెలుగు ప్రజలను కాంగ్రెసు పార్టీ మోసం చేస్తోందని ఆరోపించారు. ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. సీమాంధ్రకు చెందిన 19 మంది ఎంపీలు రాజీనామా చేస్తే యూపిఏ బలం 263కు పడిపోతుందన్నారు. స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు లేదనే విషయం లగడపాటికి తెలియదా అని ప్రశ్నించారు. లగడపాటి ఎందుకు డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు.
ఫైలిన్ పేరుతో...:
ఫైలిన్ తుఫాను పేరుతో ఉద్యోగులతో సమ్మె విరమింప చేస్తున్నారని శాసన మండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నాయకులు మీడియా ముందు మైకులు బద్దలు కొట్టడం కాకుండా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా ఇంటి గేటు పగులగొట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications