టార్గెట్ 2019: గెలుపుకోసం ఎమ్మెల్యే సూరి యాక్షన్ ప్లాన్ ఇదే
2019 ఎన్నికల కోసం ధర్మవరం టిడిపి ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణరెడ్డి ఇప్పటినుండే ప్లాన్ చేసుకొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం 240 టీమ్‌లను ఏర్పాటుచేశారు.ఈ టీమ్‌లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆయ
ధర్మవరం: 2019 ఎన్నికల కోసం ధర్మవరం టిడిపి ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణరెడ్డి ఇప్పటినుండే ప్లాన్ చేసుకొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం 240 టీమ్‌లను ఏర్పాటుచేశారు.ఈ టీమ్‌లు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆయనకు అందజేయనున్నాయి. ప్రత్యర్థులకు అవకాశం దక్కకుండా ఉండేందుకుగాను ఈ టీమ్‌లు తమ ప్రయత్నాలను చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి అప్పుడే ప్రారంభమైంది. టిడిపి, వైసీపీ నేతలు ఎన్నికల వ్యూహలను రూపొందిస్తున్నాయి. అయితే ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే ఇప్పటినుండే ప్లాన్ చేసుకొంటున్నారు.
ఈ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, ప్రత్యర్థులు ఇస్తోన్న హమీలు, తాను ఏం చేయాలనే విషయమై ఎప్పటికప్పుడు వ్యూహలను మార్చుకొనేందుకు వీలుగా క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పించుకొంటున్నారు.
ఎక్కడ ఏం జరిగినా తనకు సమాచారం తెలిసేలా సూరి సమాచారవ్యవస్థను ఏర్పాటుచేసుకొంటున్నారు.ఈ సమాచార వ్యవస్థ ఆధారంగా ఆయన 2019 ఎన్నికలకు ఆయన సిద్దమౌతున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థులకు అవకాశం లేకుండా చేసేందుకు ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

240 టీమ్‌ల ఏర్పాటు
2019 ఎన్నికల్లో గెలుపు కోసం వరదాపురం సూచి పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారు. తన గెలుపుకోసం 240 టీమ్‌లను ఏర్పాటుచేశారు. ఈ నియోజకవర్గంలో హర్డ్‌కోర్, సాఫ్ట్‌కోర్ పేరుతో టీమ్‌ను విభజించారు. ఈ రెండు పేర్లతో 240 టీమ్‌లను ఏర్పాటుచేశారు.ప్రతి వందమందికి ఓ కోఆర్డినేటర్‌ను నియమిస్తారు. 2400 మంది కోఆర్గినేటర్లను నియోజకవర్గంలో కోఆర్డినేటర్లుగా నియమిస్తారు. వీరే సాఫ్ట్‌కోర్ సభ్యులు. వీరి ద్వారా ఓటర్లకు కావాల్సిన సదుపాయాలు, వారు ఎదుర్కొనే సమస్యలను గుర్తిస్తారు. ఆయా అంశాలపై ప్రత్యర్థులు చేసే విమర్శలు, దాడులకు హర్డ్‌కోర్ టీమ్ రెడీగా ఉంటుంది. నియోజకవర్గంలో ఎక్కడైనా సమరానికి సై అనేండుకు కూడ ఈ టీమ్ సన్నద్దంగా ఉంటుంది.

మెరికల్లాంటి యువతకు శిక్షణ
హర్డ్‌కోర్ టీమ్‌లో పనిచేసేందుకుగాను మెరికల్లాంటి యువతను ఎంపికచేసి వారికి శిక్షణ ఇవ్వనున్నారు. అన్ని రకాలుగా వారిని శిక్షణలో రాటుదేలేలా చేస్తారు. నియోజకవర్గవ్యాప్తంగా సుమారు 2640 మందికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కఠిన శిక్షలు ఇవ్వనున్నారు. మొత్తంగా ఇందులో భాగంగా వారికి రూ.25 కోట్ల విలువైన పనులను అప్పగించేంచనున్నారని ప్రచారం సాగుతోంది.

నిఘా కమిటీ పర్యవేక్షణ
నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా హర్డ్‌కోర్ టీమ్ అక్కడికి చేరుకొంటోంది. హర్డ్‌కోర్, సాఫ్ట్‌కోర్ టీమ్ సభ్యుల పనితీరును పర్యవేక్షించేందుకుగాను నిఘా కమిటీని కూడ ఏర్పాటుచేశారు. ఈ నిఘా కమిటీ ఎప్పటికప్పుడు ఈ రెండు టీమ్‌ల పనితీరును పర్యవేక్షించనుంది.ఈ రెండు టీమ్ సభ్యులు ఏదైనా పొరపాటు చేస్తే నిఘా కమిటీ సరిచేసే బాధ్యతలను తీసుకోనుంది.

ఒక్కఓటు ప్రత్యర్థులకు వెళ్ళకుండా ప్లాన్
ప్రత్యర్థులకు ఒక్కఓటు వెళ్ళకుండా ఉండేందుకుగాను వరదాపురం సూరి ప్లాన్ చేస్తున్నారు. హర్డ్‌కోర్, సాఫ్ట్‌కోర్ సభ్యులు వ్యూహరచన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ప్రజలు కోరుకొంటున్న ప్రత్యామ్నాయాలను కూడ ఈ టీమ్‌లు సూరికి చేరవేయనున్నాయి. దీని ఆధారంగా ఎమ్మెల్యే ప్లాన్ చేయనున్నారని ప్రచారం సాగుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications