క్యాడర్ అడ్డుకుంటే కారు దిగిన బాబు: జనసేన మద్దతు!

 Dharna at Chandrababu Naidu's residence
హైదరాబాద్: టిడిపి, బిజెపి పార్టీల మధ్య పొత్తు చంద్రబాబు నాయుడుకు తలబొప్పి కట్టిస్తోంది. ఇప్పటికే విజయవాడ సెంట్రల్, మల్కాజిగిరి, నర్సాపురం తదితర స్థానాల పైన అభ్యర్థులు తమ అసంతృప్తిని వెళ్లగక్కడంతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సై అంటున్నారు.

సోమవారం ఉప్పల్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఆశావహులు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటి ముందు ధర్నాకు దిగారు. పొత్తులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించవద్దని విజయరామరావు అనుచరులు ఆందోళనకు దిగారు. ఉప్పల్ కేటాయించవద్దని మరికొందరు ధర్నా చేశారు. ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు.

సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు తెలంగాణ అభ్యర్థులను ప్రకటించిన అనంతరం వెళ్తుండగా.. కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబు వాహనం దిగి వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్దుబాట్లలో త్యాగాలు తప్పవని, దేశంలో ఎన్డీయే, రాష్ట్రంలో టిడిపి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఇప్పుడు అన్యాయం జరిగిన వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో టిడిపి వస్తుందని, అప్పుడు అందరికీ న్యాయం చేస్తామన్నారు.

కాకినాడలో బిజెపి కార్యాలయం ఎదుట

పొత్తుపై బిజెపిలోను అసంతృప్తి వెల్లువెత్తుతోంది. సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్టీ కార్యాలయం ఎదుట బిజెపి కార్యకర్తలు చంద్రబాబు దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. జిల్లాలో మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు సీటు ఇవ్వకుంటే రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరించారు.

తిరుపతిలో జనసేన మద్దతు!

టిడిపి, బిజెపి పార్టీల పొత్తును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా క్యాడర్ స్వాగతించినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+