వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనొక్కడినే బతికాను: మృత్యంజయుడు ఈగల కిరణ్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం తుఫాన్‌ వాహనం గోదావరి నదిలో పడిపోయి, 22 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో 13 ఏళ్ల చిన్నారి ఈగల కిరణ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.

స్వల్పంగా గాయపడిన కిరణ్ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదాన్ని కళ్లారా చూసిన కిరణ్ ప్రమాదం గురించి ఏం చెప్పాడో చూద్దాం. రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపాడు. కిరణ్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో నేను మా డాడీ ఒళ్లో ఉన్నాను.

అప్పుడు మా డాడీ నన్ను, అక్కను గట్టిగా పట్టుకొని దాచాడు. డాడీకి బాగా దెబ్బలు తగిలాయి. మమ్మీకి కూడా.. నాకు తల మీద దెబ్బ తగిలిందని చెప్పాడు. అయినా సరే అక్కను బయటకు తీసుకువద్దామని ప్రయత్నించాను. కుర్చీలు అడ్డు రావడంతో తీసుకురాలేకపోయానని తెలిపాడు. నేను మాత్రం కిటీకీలోంచి బయటకు వచ్చానని చెప్పిన కిరణ్, ఆ తర్వాత వేరే వాళ్ల సాయంతో అక్కను బయటకు తెచ్చినా చనిపోయిందని ఎంతో ఆవేదనతో చెప్పాడు.

చివరకు నేనొక్కడినే బతికానని చెప్పాడు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఈ ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. మృతులు విశాఖ జిల్లా అచ్చుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన ఈగల రాంబాబు కుటుంబానికి చెందినవారు. ఈనెల 6న తమ తుఫాన్ వాహనంలో తీర్ధయాత్రకు వెళ్లారు.

భద్రాచలం, శ్రీశైలం, తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ దుర్గమ్మ ఆలయాలను దర్శించుకొని శుక్రవారం తమ స్వస్ధలానికి బయలుదేరారు. ధవళేశ్వరం బ్రిడ్జిపై నుంచి వెళుతుండగా వాహనం అదుపుతప్పి, రోడ్ డివైడర్‌ను ఢీకొని బ్రిడ్జిపై నుంచి నదిలో పడిపోయింది. దీంతో వాహనంలో ఉన్న 23 మందిలో ఇద్దరు మినహా అందరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే.

మృత్యంజయుడు ఈగల కిరణ్

మృత్యంజయుడు ఈగల కిరణ్

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం తుఫాన్‌ వాహనం గోదావరి నదిలో పడిపోయి, 22 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో 13 ఏళ్ల చిన్నారి ఈగల కిరణ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.

మృత్యంజయుడు ఈగల కిరణ్

మృత్యంజయుడు ఈగల కిరణ్

స్వల్పంగా గాయపడిన కిరణ్ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదాన్ని కళ్లారా చూసిన కిరణ్ ప్రమాదం గురించి ఏం చెప్పాడో చూద్దాం. రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపాడు. కిరణ్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో నేను మా డాడీ ఒళ్లో ఉన్నాను.

మృత్యంజయుడు ఈగల కిరణ్

మృత్యంజయుడు ఈగల కిరణ్

అప్పుడు మా డాడీ నన్ను, అక్కను గట్టిగా పట్టుకొని దాచాడు. డాడీకి బాగా దెబ్బలు తగిలాయి. మమ్మీకి కూడా.. నాకు తల మీద దెబ్బ తగిలిందని చెప్పాడు. అయినా సరే అక్కను బయటకు తీసుకువద్దామని ప్రయత్నించాను. కుర్చీలు అడ్డు రావడంతో తీసుకురాలేకపోయానని తెలిపాడు.

మృత్యంజయుడు ఈగల కిరణ్

మృత్యంజయుడు ఈగల కిరణ్

నేను మాత్రం కిటీకీలోంచి బయటకు వచ్చానని చెప్పిన కిరణ్, ఆ తర్వాత వేరే వాళ్ల సాయంతో అక్కను బయటకు తెచ్చినా చనిపోయిందని ఎంతో ఆవేదనతో చెప్పాడు. చివరకు నేనొక్కడినే బతికానని చెప్పాడు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఈ ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

English summary
Dhavaleswaram bridge Toofan car accident, 22 dead and 1 children injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X