చంద్రబాబు నోట...పేకాట మాట...

అమరావతి: ఎప్పుడూ రాజకీయాలు, అభివృద్ది గురించే మాట్లాడే చంద్రబాబు నోటి నుంచి కాలక్షేపం కబుర్లు వినడం అత్యంత అరుదైన సందర్భమే...నిరంతరం సీరియస్ గా, ఫోకస్డ్ గా ఉండే చంద్రబాబు పేకాట గురించి మాట్లాడారంటే నమ్ముతారా?...పైగా పేకాట గురించి మాట్లాడటమే కాదు దాన్నిపొగిడారంటే అసలు నమ్మశక్యం అవుతుందా?...కానీ ఇది నిజం...చంద్రబాబే స్వయంగా చెప్పారు...ఆశ్చర్యంగా ఉంది కదా...అయితే చంద్రబాబు ఎక్కడ ఏ సందర్భంలో ఇలా పేకాట గురించి మాట్లాడారో ఇప్పుడు తెలుసుకుందాం.

తన రాజకీయ ప్రస్థానం మొదలై 40 ఏళ్లు అయిన సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో చంద్రబాబు తన జీవితంలోని ముఖ్య ఘట్టాల గురించి తెలియజేస్తూ ఎపి ప్రజలకు తెలియని అనేక సీరియస్, నాన్ సీరియస్ విషయాల గురించి కూడా వెల్లడించారు. అందులో పేకాట ప్రస్తావన ఒకటి...అంతేకాదు చంద్రబాబు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రెండు సార్లు పేకాట ప్రస్తావన తీసుకురావడం విశేషం.

Did Chandrababu talk about poker? ... surprise

సందర్భం 1...చంద్రబాబు చిన్నతనంలో పేకాట ఆడేవారట...అంతేకాదు చంద్రబాబు ఆ ఆటలో డబ్బులు కూడా బాగా వచ్చేవట...ఈ విషయం తన రాజకీయ ప్రస్థానం మొదలై 40 ఏళ్లు గడచిన సందర్భంగా ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబే చెప్పారు...అయితే పేకాటను నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదన్నట్లుగా కూడా చంద్రబాబు సమర్థించడం విశేషం. చంద్రబాబు పేకాట గురించి మాట్లాడుతూ..."అది ఫోకస్ తో కూడిన గేమ్...ఏ కార్డు నుంచి ఏ కార్డుకు వెళ్లాలనేది ఒక నాలెడ్జ్" అని చెప్పారు...అందరూ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చే పేకాట గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్లుగా...పాజిటివ్ గా చెప్పడం నిజంగా విశేషమే కదా మరి...

సందర్భం 2...ఆంధ్రజ్యోతికి ఇచ్చిన అదే ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు నోట మరోసారి పేకాట గురించి ప్రస్తావన వచ్చింది...అయితే ఈసారి మాత్రం నెగిటివ్ గా అనే చెప్పాలి. పేకాట వల్ల సమయం వృధా అవుతుందనే అర్థంలో చంద్రబాబు ఈ మాటలు అన్నట్లుగా కనిపిస్తోంది. కుటుంబానికి సమయం కేటాయించడం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబును అడుగుతూ మీరు హాలిడేకు వెళ్లినా అక్కడ కూడా కాన్ఫరెన్స్ లు పెడతారు కదా అన్న ప్రశ్నకు సమాధానంగా..."ఒక్కొక్క పనిలో ఒక్కొక్కరికి సంతృప్తి ఉంటుంది...కొందరు గంటల కొద్దీ పేకాట ఆడతారు...నాకు పని చేయడంలోనే సంతృప్తి"...అని చెప్పారు...అవండీ చంద్రబాబు నోటి వెంట పేకాట గురించి వచ్చిన ఒకే ఇంటర్వ్యూలో వచ్చిన రెండు సందర్భాలు...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+