షాక్: బిజేపీలోకి దినేష్, దిడ్డిరాంబాబు, కమల బలం 12

Diddi Rambabu to join BJP
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెసు పార్టీకి పెద్ద షాక్ తగిలింది. కార్పోరేషన్లలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న దిడ్డి రాంబాబు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఆయన తన రాజీనామా పత్రాలను నగర పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్‌కు బుధవారం పంపించారు. ఆయన బీజేపీలో చేరనున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ వస్తున్నారు. ఆయన సమక్షంలో రాంబాబు కమల తీర్థం పుచ్చుకోనున్నారు. గ్రేటర్లో కాంగ్రెసు పార్టీ కార్పోరేటర్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన గోయల్, జితేంద్రలు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇప్పుడు దిడ్డి రాంబాబు చేరుతున్నారు. ఈయతో పాటు బేగంబజార్ కార్పోరేటర్ శంకర్యాదవ్ బిజేపీలోకి వెళ్తున్నారు.

కార్పోరేషన్ ఎన్నికల తర్వాత బీజేపీకి 5గురు కార్పోరేటర్లు మాత్రమే ఉండగా.. ఇప్పటి వరకు చేరిన వారితో కలిసి బీజేపీ బలం 12కు చేరింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు పలువురు కార్పోరేటర్లు బీజేపీలో చేరుతుండటం ఆ పార్టీ వారికి కొత్త ఉత్సాహం ఇస్తోంది.

బీజేపీలోకి దినేశ్ రెడ్డి

ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత దినేశ్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే దినేశ్ రెడ్డి చేరిక కోసం బీజేపీలో అంతా సిద్ధమైందని తెలుస్తోంది. బీజేపీలో దినేశ్ రెడ్డికి జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+