రాజకీయాలు: మనకంటే నార్త్‌లో కష్టమేనా?
హైదరాబాద్: రాజకీయాలు దక్షిణ భారత దేశంలో కొంతమేలని, ఉత్తర భారత దేశంలో మాత్రం అదో బాల్ గేమ్ అని ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద ఇటీవల చెప్పారు. దక్షిణాదిన రాజకీయం పేరుతో ఎవరినైనా అణగదొక్కడం తక్కువగా ఉంటుందని, అదే నార్త్‌లో చాలా ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
నార్త్‌లో పోరాడాలంటే చాలా పెద్ద గుండె ఉండాలన్నారు. సౌత్, నార్తిండియన్ రాజకీయాల్లో చాలా తేడా ఉంటుందని చెప్పారు. తనకు రాజకీయాలు బోనస్ మాత్రమేనని అన్నారు. సినిమాల్లో తనకు వచ్చిన స్టార్ డమ్ రాజకీయాల్లో ఉపయోగపడిందని చెప్పారు.

తాను ఎప్పుడు కూడా తానో రాజకీయ నాయకురాలిని అని చెప్పలేదన్నారు. తనకు పొలిటికల్ బ్రెయిన్ లేదన్నారు. తాను మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం, నిర్భయ అత్యాచారం పైన, బీడీ వర్కర్ల గురించి.. ఇలా పలు అంశాలపై తాను పార్లమెంటులో లేవనెత్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications