జగన్ పార్టీలోకి అనంత: గుర్నాథ్ అలక, పార్టీకి గుడ్ బై!

మొదటి నుండి అనంత వెంకట్రామి రెడ్డితో గుర్నాథ్ రెడ్డికి విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి అనంత రావడాన్ని గుర్నాథ్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆయన పార్టీకీ గుడ్ బై చెప్పాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన వర్గం అనంత చేరికను వ్యతిరేకిస్తోంది.
దీంతో జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీలిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే తన కార్యకర్తలతో గుర్నాథ్ రెడ్డి సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించనున్నారు. బుజ్జగింపులతో పార్టీలో కొనసాగుతారా లేక ఏ పార్టీలోకి వెళ్తారో తేలనుంది.
కాగా, అనంతపురం కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామి రెడ్డి ఆదివారం సాయంత్రం ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో అనంత బలమైన నాయకుడు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications