రాఘవులు, నారాయణ మధ్య జగన్ సీట్ల చిచ్చు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో సంబంధాల వ్యవహారం ఉభయ కమ్యూనిస్టుల మధ్య చిచ్చు పెట్టింది. వైయస్ జగన్‌తో సిపిఎం సీట్ల సర్దుబాటు చేసుకుందని సిపిఐ కార్యదర్సి కె. నారాయణ చేసిన వ్యాఖ్యకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు భగ్గుమన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సిపిఎం సీట్ల సర్దుబాబు చేసుకుందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలను బీవి రాఘవులు ఖండించారు. నారాయణ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని ఆయన అన్నారు.
ఈ మేరకు నారాయణకు రాఘవులు బహిరంగ లేఖ రాశారు. మీడియా సమావేశంలో ఆ లేఖను విడుదల చేశారు. నారాయణ వ్యాఖ్యల్లో నిజాయితీ ఉంటే రుజువు చేయాలని సవాల్ విసిరారు. పొత్తులపై ఇప్పటివరకు తమ పార్టీలో చర్చించలేదని రాఘవులు స్పష్టం చేశారు. నారాయణ చౌకబారుగా మాట్లాడడం వల్ల తమ పార్టీ ప్రతిష్టకొచ్చే నష్టమేమీ లేదని ఆయన అన్నారు.

వామపక్ష ఐక్యత విషయంలో తమ పార్టీ పద్ధతి చెప్తే నారాయణకు ఎందుకు అంత ఆందోళనని రాఘవులు ప్రశ్నించారు. తమ పార్టీపై నారాయణ ఆరోపణలు తగదని ఆయన హెచ్చరించారు. మనల్ని మనం చులకన చేసుకోవద్దని నారాయణకు చురకలు అంటించారు. చాటుమాటుగా మాట్లాడుకోవడం తమకు అలవాటు లేదన్నారు. జాతీయ కార్యవర్గ నిర్ణయాలకు తాము కట్టుబడి ఉంటామని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోమని చెప్పారు.
వామపక్షాల ఐక్యతపై సిపిఎం ఇటు తమతో మాట్లాడుతూనే అటు వైయస్సార్ సీట్ల బేరానికి దిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గురువారం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు వైఖరిపై మండిపడ్డారు. తమది సమైక్యవాదమంటున్న ఆ పార్టీ ఆ మేరకు ప్రజల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తమ వైఖరిని ధైర్యంగా చెప్పుకోలేని దుస్థితిలో ఉండటమే ఇందుకు కారణమని అన్నారు.
గత ఎన్నికలలో కాంగ్రెస్-తెరాస (2004), తెలుగుదేశం - తెరాస (2009)లతో కూటమిగా వామపక్షాలు పోటీ చేశాయని గుర్తుచేశారు. ఆ సమయంలో వారికి సమైక్యవాదం జ్ఞాపకం లేదా? అని ఆయన రాఘవులును ప్రశ్నించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications