చంద్రబాబు నెత్తిన మరో పిడుగు

టికెట్ల పంచాయితీ టీడీపీలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే టికెట్లు దక్కని నేతలు రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేయస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయంలో ఓ వెలుగు వెలిగిన నేతలకు సైతం టికెట్ దక్కని పరిస్థితి. జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. దేవినేని, ఆలపాటి,వర్మ , బండారు సత్యనారాయణ, పీతల సుజాత, ప్రభాకర్ చౌదరి వంటి సీనియర్ నేతలకు మొండిచేయి ఎదురైంది.

టికెట్ ఆశించిన నేతలకు మొండిచెయి ఎదురుకావడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటికే అనంతపురం అర్బన్ , గోపాలపురం నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. పార్టీ గెలుపుకు నాయకులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ఉండి నియోజకవర్గంలో కూడా ఇదే తంతు కనిపిస్తోంది. ఇప్పటికే ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా రామరాజు పేరు ప్రకటించారు.

Differences emerged in TDP in Undi constituency

రామరాజు గత ఎన్నికల్లో జగన్ హవాను తట్టుకుని మరి టీడీపీ తరుఫున విజయం సాధించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉండి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరునే ఖారారు చేశారు. అయితే వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామ కృష్ఱంరాజు టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. రామరాజు టికెట్ ని కాస్తా రఘురామకృష్ణంరాజుకి కట్టబెడుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తీసుకున్నఈ నిర్ణయంతో ఎమ్మెల్యే రామరాజు మైండ్ బ్లాంక్ అయింది.

దీంతో ఎమ్మెల్యే వర్గం అక్కడే ఆందోళనకు దిగింది. తమ నేతను మార్చడంపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన స్పందించిన ఎమ్మెల్యే రామరాజు..రఘురామరాజు కోసం తనని బలిచేయడం కరెక్ట్ కాదంటున్నారాయన. 2019లో తాను ఇక్కడ్నుంచి గెలిచానని, ఈసారి కూడా విజయావకాశాలు తనకే ఉన్నాయని చెబుతున్నారు. రఘురామకు టికెట్ ఇస్తే ఉండి సీటుపై టీడీపీ ఆశలు వదిలేసుకోవాల్సిందేనని అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. కానీ చంద్రబాబు మాత్రం వారి నిరసనలు పట్టించుకోవడంలేదు. దీంతో ఎమ్మెల్యే రామరాజు టీడీపీలో ఉంటారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+