మంత్రి సమక్షంలో కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు వెలుగుచూశాయి. రెండు వర్గాలు తన్నుకున్నాయి! ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే మరోవైపు అనంతలో మాత్రం టీడీపీ కార్యకర్తలు తన్నుకోవడం గమనార్హం.
నియోజకవర్గ సమీక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎమ్మెల్యే, మేయర్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడి చేసుకున్నారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డి సమక్షంలో ఈ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

కాగా, టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అంతటా ఘనంగా నిర్వహించాలని మంత్రి పరిటాల సునీత ముందు రోజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మండల పరిధిలోని వెంకటాపురంలో శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని నియోజకవర్గాలు, గ్రామాల్లో నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలు, పరిటాల అభిమానులను కోరారు. తాను కూడా రామగిరిలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటానని తెలిపారు.












Click it and Unblock the Notifications