బిల్లు కోసం డిగ్గీ, చుట్టుముట్టిన టి నేతలు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ హైదారాబాదులో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో సాఫీగా సాగేందుకు డిగ్గీ గురువారం హైదరాబాద్ వచ్చారు.
వచ్చినప్పటి నుండి ఆయన పలువురు నేతలతో కలుస్తున్నారు. గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, కొండ్రు మురళి, రఘువీరా రెడ్డి, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నాయకులు, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులను కలిశారు.
శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలిసి బిల్లు అంశంపై చర్చించారు. అనంతరం ఆయన గాంధీ భవన్‌కు వచ్చారు. డిగ్గీని కలిసేందుకు తెలంగాణ ప్రాంత నేతలు క్యూ కట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా డిగ్గీని కలిశారు. డిగ్గీ గాంధీ భవన్ నుండి గ్రేటర్ హైదరాబాదు కాంగ్రెసు కార్యాలయానికి వెళ్లి అక్కడ నాయకులను కలిశారు. అనంతరం తిరిగి గాంధీ భవన్‌కు వచ్చారు.

డిగ్గీ 1
గాంధీ భవన్‌లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిసేందుకు వచ్చిన పలువురు నేతల దృశ్యం. గాంధీ భవన్ కిక్కిరిసిపోయింది.

డిగ్గీ 2
హైదరాబాదులోని గాంధీ భవన్‌లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పార్టీకి చెందిన ఓ నాయకుడితో మాట్లాడుతూ..

డిగ్గీ 3
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం మధ్యాహ్నం గాంధీ భవన్‌లోకి వెళ్తున్న దృశ్యం. ఆయనను కలిసేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

డిగ్గీ 4
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం మధ్యాహ్నం గాంధీ భవన్ వద్ద అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న సమైక్యవాదులు.

డిగ్గీ 5
ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి విద్యార్థులు పలువురు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. వినతి పత్రం ఇస్తున్న పిడమర్తి రవి.

డిగ్గీ 6
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్‌కు వస్తున్న నేపథ్యంలో రహదారి పైన ట్రాఫిక్‌ను ఆపివేసిన నగర పోలీసులు.

డిగ్గీ 7
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిసేందుకు గాంధీ భవన్‌కు వచ్చిన నాయకులను తనిఖీ చేస్తున్న పోలీసులు.












Click it and Unblock the Notifications